ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండుగ రంజాన్..నెల రోజుల పాటు ముస్లింలు ఉపవాసం ఉంటారు..సూర్యోదయం, సూర్యాస్తమయాల మధ్యన భోజనం అస్సలు చేయరు. ఈ రంజాన్ నెలలో మతపరమైన సంబంధాలను పెంపొందించుకుంటారు. అలాగే చుట్టూ ఉన్న పేదవారికి సహాయం చేస్తారు. రంజాన్ ఇస్లామిక్ క్యాలెండర్ లో తొమ్మిదో నెల. అయితే ఇస్లాం చాంద్రమాన క్యాలెండర్ ను ఉపయోగించడం వల్ల ప్రతి సంవత్సరం ఖచ్చితమైన తేదీలు మారుతూ ఉంటాయి. ఈ ఏడాది రంజాన్ మార్చి 23 అంటే బుధవారం ప్రారంభమై ఏప్రిల్ 21 అంటే శుక్రవారంతో ఈద్ ఉల్ ఫితర్ తో ముగుస్తుంది. అయితే నెలవంక కనిపించే వరకు 29 నుంచి 30 రోజుల వరకు పవిత్ర మాసం ముగియదు. నెలవంక కనిపించగానే ఈ పండుగ ప్రారంభమవుతుంది..
అయితే,రంజాన్ మాసంలో ఉపవాసం ఉండటం ఇస్లాం మతంలో అతి ముఖ్యమైన మత ఆచారాలలో ఒకటి. దీన్ని ఇస్లాం ఐదు మూలస్తంభాలలో ఒకటిగా పరిగణిస్తారు. అలాగే విశ్వాసం, ప్రార్థన, దానం, మక్కాకు తీర్థయాత్ర వంటివి కూడా ఈ పండుగ ప్రత్యేకతలే. రంజాన్ ఉపవాసం ఆధ్యాత్మిక ఎదుగుదల, స్వీయ క్రమశిక్షణ, ఇతరుల పట్ల సహానుభూతిని పెంపొందించుకునే సామర్థ్యం కలుగుతాయని అంటారు..అది వారి నమ్మకం..
ఉపాసం ఉంటే అల్లా దయ ఉంటుందని వారి నమ్మకం.. ముస్లింలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి.. ఆహారం, నీరు, ఇతర శారీరక అవసరాలకు దూరంగా ఉంటారు. సూర్యాస్తమయం సమయంలో ఇఫ్తార్ అనే భోజనంతో ఉపవాస దీక్షను విరమిస్తారు. మళ్లీ తెల్లవారు జామున ఉపవాసాన్ని తిరిగి ప్రారంభిస్తారు.ఈ పండుగను చంద్రును ఆధారంగా మొదలుపెడతారు..రంజాన్ ఉపవాసం ప్రారంభానికి ముందు నెలవంకను చూడటానికి ప్రజలు, మత పెద్దలు రాత్రి ఆకాశం వైపు చూస్తారు. ఇది చాలా ఏండ్లుగా ఆచరిస్తున్న మత సంప్రదాయం. రంజాన్ కు ముందు షాబన్ మాసం వస్తుంది. చంద్ర దర్శన ఆచారాలను పాటిస్తే.. షాబన్ మాసంలోని 29 వ రోజు సూర్యాస్తమయం తర్వాత రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. ఇస్లాం ప్రధాన పండుగలలో ఒకటైన ఈద్ ఉల్-ఫితర్ ను రంజాన్ చివరి రోజున చేసుకుంటారు. ఇది ముప్పై రోజుల ఉపవాసం వెనుక అస్సలు నిజం..