ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే తాజాగా ఈ ఐపీఎల్ కి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ అందరిని మరింత ఆసక్తిగా ఎదురుచూసేలా చేస్తుంది.
కరోనా కారణంగా గత మూడేళ్లుగా జరగని ఐపిఎల్ ప్రారంభోత్సవ వేడుక ఈ ఏడాది మాత్రం ఘనంగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ మార్చి 31 నుండి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రారంభ వేడుకలో నేషనల్ క్రష్ రష్మిక, తమన్నా భాటియా సందడి చేయనున్నారని.. లైవ్ డాన్స్ పర్ఫామెన్స్ తో అభిమానుల్ని అలరించనున్నారని వార్త వినిపిస్తుంది.. ఇందుకు ప్రస్తుతం బీసీసీఐ గట్టిగా ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది. కాగా ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలపడం విశేషం.
ఐపీఎల్ 16వ ఎడిషన్ మార్చి 31 నుండి అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.. చెన్నై సూపర్ కింగ్స్- డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరగబోయే మ్యాచ్‌తో ఈ సీజన్ అట్టహాసంగా మొదలుకానుంది. ఈ మ్యాచ్ ప్రారంభయ్యే అరగంట ముందు ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మహిళల ఐపీఎల్ డబ్ల్యూపీఎల్‌లో కూడా ప్రారంభోత్సవ వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించింది బీసీసీఐ. ఈ వేడుకలో కియరా అద్వానీ కృతి సనన్ డాన్స్ అభిమానులు ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం 2023 సీజన్‌లో 70 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఏడేసి మ్యాచ్‌లను హౌం గ్రౌండ్లో, వెలుపల స్టేడియాల్లో ఆడాల్సి ఉండగా.. గ్రూప్-ఏలో ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, దిల్లీ క్యాపిటల్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఉన్నాయి. గ్రూప్-బీలో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఉన్నాయి. ఈ మ్యాచులన్నింటి కోసం 12 వేదికలను నిర్ణయించారు. అహ్మదాబాద్, మొహాలి, లఖ్‌నవూ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, కోల్‌కతా, జయ్‌పుర్, ముంబయి, గువాహటి, ధర్మశాల వేదికలుగా ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.