అప్పుడేపుట్టిన బిడ్డను…గోరువెచ్చని నీటితో స్నానం చేయడం కామన్..కానీ బిడ్డను కనేప్పుడు నీళ్లలో ఉండి కనడం గురించి మీరు విన్నారా..? దీన్నే వాటర్ బర్త్ అంటారు..ఇది పురాతనమైన పద్ధతి.. చాలా చోట్ల ఇప్పటికీ దీన్ని పాటిస్తున్నారు..బిడ్డ బయటకు రాగానే ఆడవారిని గోరువెచ్చని నీటిలో ఉంచి ప్రసవాన్ని చేస్తారు. కొందరికి ఇలాంటి సంప్రదాయ పద్ధతులంటే భయం ఉన్నప్పటికీ చాలామంది ఈ వాటర్ బర్త్ పద్ధతిని ఇష్టపడతారు.
ఇలా బిడ్డను కనడం వల్ల రకరకాల ప్రయోజనాలు ఉండడం కూడా తల్లులు ఈ పద్ధతని ఇష్టపడుతున్నారు.. ప్రధానంగా సాధారణ యోని ప్రసవానికి సంబంధించిన నొప్పి ఉద్రిక్తత కారణంగా, నీటి జననాలు తక్కువ బాధాకరంగా ఉంటాయి.
వాటర్ బర్త్ వల్ల లాభాలు..
ఈ పద్ధతిలో గర్భిణులు ప్రసవించే సమయంలో గోరువెచ్చని నీటిలో ఉంచుతారు. దీంతో వారి కండరాలు, నరాలు మరింత రిలాక్స్‌గా మారతాయి. దీని కారణంగా, రక్తపోటు తగ్గుతుంది. ఇది వారికి సహజ నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. అలాగే, ఈ ప్రక్రియలో విడుదలయ్యే ఎండార్ఫిన్లు నొప్పి తీవ్రతను తగ్గించి, ప్రశాంతంగా ఉండేందుకు సహకరిస్తాయి.
ప్రసవ సమయంలో గోరువెచ్చని నీటిలో కూర్చోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. కండరాలు, నరాలు తేలికవుతాయి. ఈ కారణంగా అనవసరమైన ఆందోళన తగ్గుతుంది . ఆ సమయంలో హ్యాపీ హార్మోన్లు అని పిలువబడే ఎండార్ఫిన్లు స్రవిస్తాయి. సహజ నొప్పి నివారిణిగా ఉంటాయి.
శిశువు నీటిలో జన్మించినప్పుడు, అవి శిశువు కదలికను సులభతరం చేస్తాయి. దీనిని బూయెంట్ ఎఫెక్ట్ అంటారు. అలాగే, ఈ పద్ధతిలో శిశువు త్వరగా బయటకు రావడానికి సహాయపడుతుంది. ప్రసవ సమయాన్ని కూడా తగ్గిస్తుంది.
ఈ పద్ధతి గర్భధారణ సమయంలో పెరినియం స్థితిస్థాపకతను పెంచుతుందని వైద్యులు అంటున్నారు… ఇది ప్రసవ సమయంలో స్త్రీల యోని చిలిక అవకాశాలను తగ్గిస్తుంది. అలాగే, గోరువెచ్చని నీటితో గాయాలు నివారించబడతాయి. ఇది చాలా త్వరగా గాయాలను నయం చేయడానికి కూడా సహాయపడుతుంది.
సాధారణ ప్రసవం కంటే నీటిలో బిడ్డ పుట్టడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. నొప్పి ఉండదు, ప్రసవ సమయం తక్కుగా ఉంటుంది., త్వరగా కోలుకుంటారు. కానీ నిపుణుల పర్యవేక్షణలోనే జరగాలి