వచ్చే ఎన్నికల్లో వైసిపి తుడిచిపెట్టుకుపోతుంది – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

-

వచ్చే ఎన్నికల్లో వైసిపి తుడిచిపెట్టుకుపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వై.సి.పి.నుంచి నన్ను సస్పెండ్ చేయడానికి స్వాగతిస్తున్నానని చెప్పారు. కానీ ఎలాంటి షో కాజ్ నోటీస్ లేకుండా సస్పెండ్ చేయడం సరికాదని ఫైర్‌ అయ్యారు.

వైయస్ కుటుంబానికి వీర విధేయులుగా ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరం కావడంపై ముఖ్యమంత్రి జగనే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కోట్ల రూపాయలు తీసుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణలు సరికాదని విమర్శలు చేశారు.

టిడిపి లో గెలిచి వైసిపికి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలకు ఎన్ని కోట్లు ఇచ్చారు సజ్జల స్పష్టం చేయాలన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో వైసిపి తుడిచిపెట్టుకుపోతుందని.. రెండు నెలల ముందే నేను వైసీపీకి దూరంగా ఉన్నానని వివరించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news