దంపతుల జీవితాన్నే మార్చిసిన సమోస.. లక్షల్లో సంపాదన..

-

మనిషి జీవితంలో కొన్ని సంఘటనలు జీవితాన్ని నాశనం చేస్తే మరికొన్ని మాత్రం జీవితానికి ఒక మార్గాన్ని చూపిస్తున్నాయి.. ఒక్క ఆలోచన జీవితాన్ని ఎక్కడికో వెళ్లేలా చేసింది.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే దంపతులు కూడా అలానే ఒక్క ఆలోచనతో బిజినెస్ కు నాంది వేసింది.. ఇప్పుడు లక్షల్లో సంపాదనతో పాటు అందరికి ఆదర్శంగా నిలిచారు.. వారి సక్సెస్ స్టోరీ గురించి ఒకసారి చూద్దాం..

 

సమోసా కావాలంటూ ఏడుస్తున్న చిన్నారి ఏడుపు అతని జీవితాన్నే మార్చేసింది. బెంగళూరుకు చెందిన ఓ జంట మంచి ఉద్యోగం చేస్తున్నారు..జీతాలు బాగానే ఉన్నాయి అయిన కూడా వదిలేసారు..ఉద్యోగాలను వదిలి సమోసా వ్యాపారం చేస్తూ కోట్లలో ఆర్జిస్తున్నారు. అవును… ఇది నమ్మలేని నిజం.. బెంగళూరుకు చెందిన నిధి సింగ్ ఆమె భర్త శిఖర్ వీర్ సింగ్ భారీ వేతనాలతో కూడిన ఉద్యోగాలను విడిచిపెట్టడమే కాదు, సొంత ఇంటిని కూడా తెగనమ్మి సమోసా వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టారు. ఈ దంపతులు చేసిన పనికి బంధువులు, మిత్రులు అంతా వీరి నిర్ణయం సరికాదేమో అని సందిగ్ధం వ్యక్తం చేసినా వెనకడుగు వేయలేదు. వారందరి అంచనాలనూ తలక్రిందులు చేస్తూ ‘సింగ్‌ సమోసా స్టార్టప్’ గ్రాండ్ సక్సెస్ అయింది.

Meet the husband-wife duo who sold their flat to build their dream  business, Samosa Singh

 

 

2015లో ఉద్యోగాలకు రాజీనామా చేసిన ఈ సింగ్‌ కపుల్‌ బెంగళూర్‌లో సమోసా సింగ్ పేరుతో ఫుడ్ స్టార్టప్‌ను ప్రారంభించి, రెండేళ్లలో తిరుగులేని సక్సెస్‌ సాధించారు..ప్రస్తుతం ఈ కంపెనీ వార్షిక టర్నోవర్ 45 కోట్లకు చేరిందంటే నమ్మశక్యంగాలేదు కానీ అదే నిజం. శిఖర్ సింగ్‌కు తాను చదువుకునే రోజుల్లోనే సమోసా వ్యాపారం ప్రారంభించాలనే కోరిక ఉండేదట. ఓ రోజు శిఖర్ ఫుడ్ కోర్టులో ఉండగా ఓ బాలుడు సమోసా కోసం ఏడుస్తుండటం చూసి, తన మదిలో మెదిలిన ఆలోచనను ఆచరనలోకి తెచ్చి తిరుగులేని సక్సెస్‌ సాధించాడు. దేశవ్యాప్తంగా చిన్న, పెద్దా అత్యధికంగా ఇష్టపడే స్నాక్ సమోసా. అప్పుడే శిఖర్‌సింగ్‌ నిర్ణయించుకున్నారు. తర్వాత ఉద్యోగాన్ని విడిచిపెట్టిన శిఖర్ సమోసా స్టార్టప్‌ను ప్రారంభించాడు.. ఎన్నో రకాల సమోసాలను చేస్తున్నారు.. ఇప్పుడు బిజినెస్ ను మరింత విస్తరించడానికి ఆ దంపతులు ప్రయత్నాలు చేస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news