పవన్ కళ్యాణ్ కి మద్దత్తు ఉపశంహరించుకుంటున్నాం అని మహసేన రాజేష్ ప్రకటించారు.పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే మా వర్గాలకు జగన్ గారే బెటర్ అనిపిస్తుంది అని ఆయన అన్నారు.వీళ్ళిద్దరికన్నా చంద్రబాబు గారు చాలా చాలా బెటర్.. కులం మతం పేరుతో అమాయకులపై దాడిచేసేవారు ఎవరైనా సరే వారికీ వ్యతిరేకం గా పోరాడమని అంబేద్కర్ గారు చెప్పారు అని గుర్తు చేశారు.
పవన్ కళ్యాణ్ గారి వలన జరిగే అనర్ధాలు ప్రజలకు తెలియజేస్తాం.. ఇప్పటికే చాలా సహించాం.. జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లోను ఓడించడానికి రాజ్యాంగ బద్దంగా పనిచేస్తాం అని స్పష్టం చేశారు. మాకు రాజకీయాలు, పదవులు ముఖ్యం కాదు.. అన్యాయానికి గురవుతున్న ప్రజల తరపున పోరాడటమే మాకు ఇష్టం అని తెలిపారు. పదవులు అధికారం కావాలనుకుంటే జగన్ గారితోనే ఉండేవాళ్ళం అని ఆయన అన్నారు.ఆ నాయకుల్లో నిలకడ లేనపుడు మేము కూడా నిలకడగా ఉండలేము అని అన్నారు.