జగన్ ను కలసిన ఫ్రెంచ్ ఇన్వెస్టర్లు.. లోకేశ్ షాక్ ఇచ్చేశాడు..?

-

ఏపీ పెట్టుబడులు పెట్టేందుకు ఫ్రాన్స్ పారిశ్రామిక వేత్తలు ఒకటి వచ్చింది. ఏపీలో పట్టణ మౌలిక వసతులు, స్మార్ట్‌ సిటీ, పట్టణాభివృద్ధి, ఆటోమొబైల్, సౌర, ఇంధన పునరుత్పాదకత వంటి రంగాల్లో పెట్టుబడులు పెడతామని చెబుతోంది. వారి రాకపై జగన్ సంతోషం వ్యక్తం చేశారు. రైతుల ఆదాయం పెరిగేలా పాడి, మాంసం, పండ్లు ఫలాలు, కూరగాయల వంటి రంగాలపైనా దృష్టి పెట్టి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలకు జగన్ సూచించారు.

ఇంత వరకూ బాగానే ఉంది. అయితే ఈ ఫ్రాన్స్ పారిశ్రామిక వేత్తల రాక వెనుక చాలా కుట్ర ఉందంటున్నారు ప్రతిపక్ష నేత నారా లోకేశ్.. ఈ పారిశ్రామిక వేత్తలను భారతి సిమెంట్‌ భాగస్వామిగా చెబుతున్నారు. భారతి సిమెంట్స్ జగన్ కు చెందిన కంపెనీ అన్న సంగతి తెలిసిందే. తన వ్యాపార భాగస్వామిని ఫ్రాన్స్‌ ప్రతినిధుల బృందంగా జగన్‌ చిత్రీకరించారని నారాలోకేశ్‌ విమర్శించారు.

ఈ మేరకు ట్విట్టర్ లో ఓ ట్వీట్ పెట్టారు. జగన్‌ విజన్ నచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఫ్రాన్స్ నుంచి ప్రతినిధుల బృందం ఒకటి వచ్చిందంటే తుగ్లక్‌ పాలననో ఆ విజన్ ఏంటోనని ఆశ్చర్యపోయానని ఆయన అన్నారు. తీరా ఆరాతీస్తే ఆ వచ్చిన వాళ్ళు ఫౌండేషన్‌ లూయీస్‌వికట్‌ (Foundationlouisvicat) అనే సంస్థ ప్రతినిధులని ఆయన పేర్కొన్నారు.

ఆ సంస్థ గురించి తెలుసుకుంటే అసలు సంగతి బయటపడిందన్న లోకేశ్‌జగన్‌కు చెందిన భారతి సిమెంట్ ఒక భాగస్వామి అని వివరాలను తన ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు. మరో క్విడ్ ప్రో కో లాంటిదేదో ప్లాన్ చేస్తున్నారనే అనుమానాన్ని లోకేశ్‌ వ్యక్తంచేశారు. భారతి సిమెంట్స్ వ్యాపార భాగస్వామి అంటూ ఆయన కొన్ని ఫోటోలు ఆ ట్వీట్ లో యాడ్ చేశారు. మరి వాస్తవం ఏంటో ప్రభుత్వమే బయటపెట్టాలి

Read more RELATED
Recommended to you

Latest news