మంత్రి కేటీఆర్ పై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

-

మంత్రి కేటీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. అన్నింటికీ పెద్ద ముత్తైదువ నేనే అని, మొదటి తాంబూలం నాకే అని, ఉరికి ఉరికి మీటింగులు పెడితివి కదా కూతల రామారావు.. ఈరోజు లీకేజీ బండారం బయటపడేసరికి TSPSC వ్యవహారం నీకు సంబంధం లేని సంత అయిందా? అంటూ ప్రశ్నించారు. నీ వాటా, నీ కోటా, నీ హస్తం, నీ దోస్తులు ఉన్నారని తెలిసేసరికి.. TSPSC అక్రమమైందా? అని నిలదీశారు షర్మిల.

“స్వతంత్ర ప్రతిపత్తి వ్యవస్థలు సర్కారు పరిధిలో ఉండవని బొంకుతున్నావా? TSPSC మీ ఆధీనంలో లేకపోతే TSPSC సభ్యులను నియమించనందుకు కోర్టుకు నువ్వు ఎందుకు సంజాయిషీ ఇచ్చుకున్నావు? TSPSC చైర్మన్ ని నియమించనందుకు నువ్వెందుకు కోర్టు మొట్టికాయలు తిన్నావు? నీకేం సంబంధం లేకుంటే నీది కాని శాఖల మంత్రులతో నువ్వు ఎందుకు రివ్యూలు చేస్తున్నావు? అన్ని సక్రమంగా జరిగితే క్రెడిట్ మీదా?ఏదైనా అక్రమం జరిగితే, ఆ తప్పు అధికారులదా?మొన్నటి దాకా TSPSC ద్వారా లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని డబ్బా కొట్టుకున్న రామారావు, ఇవాళ పేపర్ లీకేజీ వ్యవహారం బయటికి రాగానే TSPSCకి రాంరాం అంటున్నావు.

TSPSC స్వతంత్య్ర వ్యవస్థ అని కూనిరాగాలు తీస్తూ.. ప్రతిపక్షాల మీద కేసులు పెడుతూ.. నీ తప్పును కప్పిపుచ్చాలని చూస్తున్నావు. 30లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న నిన్ను రాజీనామా చేయమనడం తప్పా? లక్షా 91వేల ఉద్యోగ ఖాళీలు ఉంటే అసలు ఖాళీలే లేవని బుకాయిస్తూ,
ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా కొందరు నిరుద్యోగులను చంపారు. 26వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్లు ఇచ్చి, ఇప్పుడు గ్రూప్-1 పేపర్లు అమ్ముకొని, మిగిలినోళ్లని చంపుతున్నారు. మీరు సుద్ద పూసలే అయితే CBIతో విచారణ చేయించు. నీ కథ ఏందో తెలుస్తది. ఎవరు ఎవరిని బేవకూఫ్ చేస్తున్నారో బయటపడుతది” అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news