తల్లితండ్రులకు శుభవార్త: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు !

-

తాజాగా విద్యకు సంబంధించిన వార్త తల్లితండ్రులకు శుభవార్త అని చెప్పాలి. కేంద్రీయ విద్యాలయాలలో విద్యాసంవత్సరానికి 2023-2024 సంబంధించిన నోటిఫికేషన్ ఈ రోజు విడుదల చేసింది. ఒకటవ తరగతికి చెందిన ప్రవేశాలు ఈ రోజు నుండి ఏప్రిల్ 17 వరకు జరగనున్నాయి. అయితే ఒకటవ తరగతిలో చేరాలి అనుకునే పిల్లలకు 2023 మార్చి సమయానికి ఆరు సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి. ముందుగా ఆన్లైన్ లో అప్లై చేసుకున్న వారి లిస్ట్ ను ఏప్రిల్ 20 న ఫలితాలు విడుదల చేస్తారు. ఆ తర్వాత 21 నుండి అడ్మిషన్ లు ప్రారంభిస్తారట.

ఇక రెండవ తరగతి మరియు ఆపై తరగతులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ గడువు ఏప్రిల్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ విషయాన్ని మనకు తెలిసిన వారికి షేర్ చేసుకుని కేంద్రీయ విద్యాలయాల్లో విద్యను పొందే అవకాశాన్ని అందిద్దాం.

ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాల కోసం kvsangathan.nic.in వెబ్ సైట్ ను సందర్శించండి.

Read more RELATED
Recommended to you

Latest news