హర్యానాలో కొత్త స్టాటజీని అమలు చేస్తున్న బిజేపీ.. గెలుపుపై ధీమా..

-

పదేళ్ల నుంచి హర్యానాలో బిజేపీ అధికారంలో ఉంది.. మరోసారి కూడా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అగ్రనేతలు ఈ రాష్తంపై ఫోకస్ పెట్టారు.. స్వతంత్ర్య అభ్యర్దులతో టచ్ లో ఉంటూనే.. రాజకీయాలు వ్యూహాలు రచిస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీని అధికారాన్ని దక్కుకుండా చేసేందుకు కమలనాధులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.. 90 అసెంబ్లీ స్థానాలకు ఒకే సారి ఎన్నికలు జరుగుతూ ఉండటంతో అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి..

ప్రాంతీయ పార్టీలు ఓ వైపు.. జాతీయ పార్టీలు మరోవైపు పోటాపోటీగా ఎన్నికల స్టాటజీని ఫాలో అవుతున్నాయి.. 2014 పార్లమెంటు ఎన్నికల్లో హర్యానాలో ఉన్న పది పార్లమెంటు స్థానాలను బీజేపీకి దక్కించుకుంది. అయితే 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు స్థానాలను గెలుచుకుని తాము కూడా బలపడ్డామనే సంకేతాలిచ్చింది.. దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికలు రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి.. కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీపార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలైన జేజేపీ, ఐఎన్ఎల్‌డీలు కూడా ఎన్నికల బరిలో నిలవడంతో పోటీ ఆసక్తికరంగా మారింది.

ఆమ్ ఆద్మీ పార్టీ, జేజేపీ, ఐఎన్ఎల్‌డీలు ఎవరి ఓట్లకు గండి కొడతాయన్న టెన్షన్ ప్రధాన పార్టీల్లో కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ పదేళ్ల నుంచి అధికారంలో ఉండటంతో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను మూడు పార్టీలూ చీల్చుకుంటాయని, ఫలితంగా తమ గెలుపునకు అవకాశం ఏర్పడుతుందని కమలనాధుల అంచనా వేస్తున్నారు.. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉండటం కూడా తమకు కలసి వచ్చే అంశంగా బీజేపీ భావిస్తుంది. బిజేపీ వ్యతిరేక శక్తులను కలుపుకుని పోవడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోతుందనే ప్రచారం జరుగుతుంది.. బిజేపీ వ్యతిరేక పార్టీలైన ఆప్, ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది.. అయితే గెలుపుపై ఆ పార్టీ కూడాధీమాగా ఉంది.. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని.. అందుకే గత లోక్ సభలో తాము సాధించిన సీట్లే ఉదాహరణగా చెబుతోంది..

హర్యానా ప్రజల మూడ్ ను ఎవ్వరూ తెలుసుకోలేకపోతున్నారు.. హర్యానా ప్రజలు తెలివైన వారని.. అభివృద్ది చేస్తున్న తమకే పట్టం కడతారని బిజేపీ నేతలు చెబుతున్నారు.. ఒకవేళ హంగ్ ఏర్పడితే.. తాము అవసరమొస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ, జేజేపీ, ఐఎన్ఎల్‌డీలు పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి.. మొత్తం మీద హర్యానా ఎన్నికలు అన్ని పార్టీల

Read more RELATED
Recommended to you

Latest news