అతి జుగుప్సాకరమైన ఘటన త్రిపుర శాసనమండలిలో చోటు చేసుకుంది. నియోజకవర్గ ప్రజల సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి వాటి పరిష్కారం కోసం కృషి చేయవలసిన ఎమ్మెల్యే ఆ సమావేశాల్లోనే పోర్న్ వీడియోలు చూశారు. త్రిపుర లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో బాగ్ బాషా నియోజకవర్గానికి చెందిన బిజెపి ఎమ్మెల్యే జదబ్ లాల్ నాథ్ కుర్చీలో దర్జాగా కూర్చుని పోర్న్ వీడియోలు చూస్తూ కెమెరా కి చిక్కారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. గతంలోనూ ముగ్గురు ఎమ్మెల్యేలు కర్ణాటక శాసనసభలో ఇలా పోర్న్ వీడియోలు చూస్తూ కెమెరాలకు చిక్కారు. ఇలా ప్రజాప్రతినిధులు తమ హోదాను మరిచి, తాము ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నామనె ఇంగిత జ్ఞానం మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. చట్టసభలో కూర్చుని ప్రజలకు అవసరమైన పనులపై చర్చించాల్సిన నేతలు అశ్లీల వీడియోలు చూస్తున్నారు. ఇలాంటి నేతలనా మనం ఎన్నుకుంది అంటూ సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు నేటిజెన్లు.
Tripura BJP MLA caught watching porn during Assembly session, video goes viral pic.twitter.com/3bLI4ahzPs
— India Today NE (@IndiaTodayNE) March 30, 2023