ఆ రైలు ఏకంగా 4 ఏళ్లు ఆలస్యంగా వచ్చింది. షాకింగ్..!

-

మన దేశంలో రైళ్లు ఎంత ఆలస్యంగా నడుస్తాయో అందరికీ తెలిసిందే. కొన్ని నిమిషాల వ్యవధి మొదలుకొని కొన్ని గంటల వ్యవధి వరకు అవి ఆలస్యంగా నడుస్తుంటాయి. ఇక కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని రైళ్లు రోజుల తరబడి ఆలస్యంగానే వస్తుంటాయి. అయితే ఇప్పుడు చెప్పబోయే ఆ రైలు మాత్రం ఎన్ని సంవత్సరాలు ఆలస్యంగా వచ్చిందో తెలుసా..? 4 ఏళ్లు. అవును, మీరు విన్నది నిజమే. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..

నవంబర్ 10, 2014న వైజాగ్‌లో ఉన్న ఇండియన్ పొటాష్ లిమిటెడ్ కంపెనీ నుంచి డై అమ్మోనియం పాస్ఫేట్ (డీఏపీ) అనే ఎరువును ఉత్తర ప్రదేశ్ బస్తీ అనే ప్రాంతానికి చెందిన రామచంద్ర గుప్తా బుక్ చేసుకున్నాడు. అదే రోజున వైజాగ్‌లో ఆ ఎరువుతో ఓ గూడ్స్ ట్రెయిన్ (నం.107462) బయల్దేరింది. నిజానికి ట్రెయిన్ 42 గంటల పాటు ప్రయాణించి సరుకును బస్తీకి చేర్చాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ ట్రెయిన్ ఆలస్యం అయింది.

అలా 42 గంటల్లో గమ్యస్థానానికి చేరాల్సిన ఆ గూడ్స్ రైలు ఏకంగా నాలుగేళ్లు ఆలస్యంగా వచ్చింది. ఇటీవలే ఆ రైలు గమ్యస్థానానికి చేరుకుంది. అయితే ఆ ట్రెయిన్‌లో ఉన్న ఎరువు చెడిపోవడంతో తాను డబ్బులివ్వనని గుప్తా అంటున్నాడు. ఇక ఈ విషయమై ఇండియన్ పొటాష్ కంపెనీ రైల్వేశాఖ మీద ఫైర్ అయింది. మరీ ఇంత ఆలస్యమైతే ఎలాగని, తమకు రూ.10 లక్షల నష్టం వచ్చిందని, దాన్ని భర్తీ చేయాలని రైల్వేపై కోర్టుకెక్కనుంది. దీంతో ఇప్పుడు రైల్వే వారు తలపట్టుకుంటున్నారు. అసలు ట్రెయిన్ ఆలస్యానికి కారణమేంటో తెలుసుకుంటామని అంటున్నారు. ఏది ఏమైనా అది గూడ్స్ రైలు అయింది కాబట్టి సరిపోయింది, అదే ప్రయాణికులను తీసుకెళ్లే రైలు అయి ఉంటే..? ఊహించుకుంటానికే షాకింగ్‌గా ఉంది కదా..!

Read more RELATED
Recommended to you

Latest news