బిఆర్ఎస్ తో పొత్తు పై టీపీసీసీ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పిసిసి చీఫ్ గా ఉన్నంతకాలం బిఆర్ఎస్ తో కాంగ్రెస్ చేతులు కలపబోదని వెల్లడించారు. ధృతరాష్ట్ర కౌగిలికి కాంగ్రెస్ సిద్ధంగా లేదని.. ఈసారి ఎన్నికలలో బిఆర్ఎస్ కి 25 సీట్లకు మించి రావని స్పష్టం చేశారు. మాఫియా పార్టీతో కాంగ్రెస్ చేతులు కలపదని చెప్పారు. బీఆర్ఎస్, బిజెపి, ఎంఐఎం ల మధ్య ట్రయాంగిల్ ఒప్పందం ఉందన్నారు రేవంత్ రెడ్డి.
అయితే ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాత్రం కాంగ్రెస్ – బిఆర్ఎస్ మధ్య పొత్తు ఉండవచ్చని చెప్పడం గమనార్హం. ఎన్నికల తర్వాత పొత్తు తప్పదనుకుంటే ప్రజలు నిర్ణయిస్తారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జానారెడ్డి. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పొత్తులు ఉంటామని ఆయన వ్యాఖ్యానించారు. అయితే వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ తో పొత్తుపై టీ కాంగ్రెస్ లో భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.