BIG BREAKING: కోటంరెడ్డి హౌస్ అరెస్ట్… దీక్షకు పోలీసుల నిరాకరణ !

-

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుండి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. అంతకు ముందే ఈయన వైసీపీని వీడుతున్నానని ప్రకటించారు. అప్పటి నుండి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నారు. ఒక తాజాగా ఈయన రెండు రోజుల క్రితం చెప్పిన విధంగా పొట్టేపాలెం కలుజు కాలువలో జలదీక్ష 6 వ తేదీ దాదాపు 10 గంటల పాటు చేపట్టనున్నట్లు ప్రకటించారు.

అయితే ఈ దీక్షకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. పైగా కాసేపటి క్రితమే కోటంరెడ్డి ఇంటికి వెళ్ళిన పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది… ఇంటి దగ్గర భారీ సంఖ్యలో అభిమానులు వచ్చి తనకు మద్దతు పలుకుతున్నారు. దీనితో కోటంరెడ్డి ఇంటి దగ్గర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ మనము ప్రజాస్వామ్యంలో ఉన్నామా ? రాచరికంలో ఉన్నామా అంటూ ప్రశ్నించారు. ఇంతటి దుర్మార్గ ప్రభుత్వాన్ని ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఓడించి బుద్ది చెప్పాలన్నారు. మరి ముందు ముందు ఏమి జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news