బాబు-పవన్ టార్గెట్‌గానే జగన్..తోడేళ్లు కాన్సెప్ట్.!

-

ఎందుకో గాని ఈ మధ్య జగన్ ఏ అంశాలపైన ఎక్కువ మాట్లాడినట్లు కనిపించడం లేదు..కేవలం చంద్రబాబు-పవన్ పొత్తుపై మాత్రం పదే పదే మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే టి‌డి‌పి-జనసేన పొత్తు ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రచారం మొదలవ్వడం, అలాగే చంద్రబాబు-పవన్ రెండు సార్లు కలవడం…అక్కడ నుంచి వైసీపీ వాయిస్ మారిపోయింది. దమ్ముంటే బాబు, పవన్ ఒంటరిగా 175 సీట్లలో పోటీ చేయాలని సవాల్ చేస్తున్నారు.

జగన్ కూడా అలాగే మాట్లాడుతున్నారు. తాము ఒంటరిగా బరిలో ఉంటామని ఎవరితోనూ పొత్తు ఉండదని, దమ్ముంటే బాబు, పవన్ కూడా ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ చేస్తున్నారు. అలాగే తోడేళ్లు అన్నీ ఒక్కటి అవుతున్నాయని, తనకు ఎవరితో పొత్తు లేదని, ప్రజలతోనే పొత్తు అని, ప్రజలకు తాను మంచి చేశానని, కాబట్టి ప్రజలు తనకు అండగా ఉండాలని కోరుతున్నారు.

తాజాగా చిలకలూరిపేట సభలో కూడా జగన్ అలాగే మాట్లాడారు.  తనని ఒంటరిగా ఎదర్కోలేక జిత్తులు, ఎత్తులు, పొత్తులు పేరుతో కుయుక్తులు పన్నుతున్నారని, నవరత్నాలతో తాను వస్తుంటే తట్టుకోలేని తోడేళ్ళు ఒక్కటవుతున్నారని ఫైర్ అయ్యారు. తనకు ప్రజలతోనే పొత్తు అని, జిత్తులు, పొత్తులు, కుయుక్తులు తనకు తెలియవని, నిజం మాట్లాడటమే తనకు తెలిసిందని,  మీ ఇంట్లో జరిగిన మంచిని కొలమానం గా తీసుకుని తనకు అండగా ఉండండని కోరారు.

అయితే పదే పదే పొత్తులపై మాట్లాడటానికి కారణం ఉంది. ఒకటి బాబు, పవన్‌లకు ఒంటరిగా పోటీ చేయమని సవాల్ చేయడం వెనుక రాజకీయం ఉంది..ఏంటంటే..వారు సవాల్ కు రెచ్చిపోయి ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి వైసీపీకి బెనిఫిట్ అవుతుంది. అందుకే అలా సవాల్ చేస్తున్నారు. రెండు..పదే పదే తాను ఒంటరి అని, తోడేళ్లు కలుస్తున్నాయని, ప్రజలే తనకు అండగాలని చెప్పడం వెనుక కారణం..ఒకవేళ బాబు-పవన్ పొత్తు ఉన్నా..జగన్ ఒక్కరే అని ప్రజల్లోకి సెంటిమెంట్ వెళుతుంది..అపుడు ప్రజలు వైసీపీ వైపు వస్తారని అనుకుంటున్నారు. అందుకే ఇలా పదే పదే పొత్తుల గురించే మాట్లాడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news