ఏసీ ని కొనాలని చూస్తున్నారా..? అయితే వీటిని తప్పక తెలుసుకోండి..!

-

వేసవిలో ఏసీ ని కొనాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు వేసవిలో ఏసీ ని మీరు కొనాలని అనుకుంటున్నారా అయితే కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి. లేకపోతే మీరే అనవసరంగా నష్టపోతారు. వేసవిలో ఏసీ ని కొనేటప్పుడు అసలు ఈ విషయాలని మిస్ అవ్వకండి. వేసవిలో ఎండలు విపరీతంగా ఉంటాయి వేడి వలన చాలా మంది ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. ఏసి ని కొనుగోలు చేసేటప్పుడు ఏసీ టైప్, ఏసి రేటింగ్, కెపాసిటీ ఇటువంటివన్నీ కూడా చూసి కొనుగోలు చేయాలి.

ఏసీలో రకాలు:

ఏసీలో రకాలు ఉంటాయి. స్ప్లిట్ ఏసి, విండో ఏసి అని. స్ప్లిట్ ఏసి కి ఇండోర్ ఔట్డోర్ యూనిట్లు ఉంటాయి. ఇండోర్ యూనిట్ గదిలో గోడకి ఉండగా అవుట్డోర్ యూనిట్ బయట ఉంటుంది. అదే మనం విండో ఏసి చూస్తే రెండు యూనిట్లు ఉండవు. స్ప్లిట్ ఏసి చల్లని గాలిని ఎక్కువ ఇస్తుంది అలానే స్ప్లిట్ ఏసి ఎక్కువ గదిలోకి విస్తరిస్తుంది. విండో ఏసిని ఒకసారి ఎక్కడైనా సెట్ చేస్తే మళ్ళీ దానిని మరొక చోటకి మార్చడం కష్టం. విండో ఏసీ కంటే స్ప్లిట్ వేసి ధర ఎక్కువ ఉంటుంది. స్ప్లిట్ ఏసి లకే మెయింటెనెన్స్ కూడా ఎక్కువ అవసరం అవుతుంది.

స్టార్ రేటింగ్:

మీరు ఎయిర్ కండిషనర్లని కొనుగోలు చేసేటప్పుడు స్టార్ రేటింగ్ కూడా చూసుకోండి ఒకటి నుండి ఐదు స్టార్ రేటింగ్ వరకు ఏసీలు ఉంటాయి. టూ స్టార్ ఏసీ తో పోల్చుకుంటే ఫైవ్ స్టార్ రేటింగ్ ఉండే ఏసీలు ఎక్కువ విద్యుత్ ని వాడుకుంటుంది ఫైవ్ స్టార్ ఏసీల వలన పవర్ ని సేవ చేయొచ్చు.

కెపాసిటీ:

ఏసీకి సంబంధించి టోన్ కెపాసిటీ అనేది ఎంతో ముఖ్యం. మీ గదికి ఎంత కెపాసిటీ ఏసి అవసరమో దానిని ముందు మీరు తెలుసుకుని దానిని బట్టి కొనుగోలు చేయండి అలానే ఎయిర్ కండిషనర్ లోని భాగాలు ఏ మెటీరియల్ తో తయారయ్యాయి అన్నది కూడా చూసుకోండి. కండెన్సర్ కాయిల్ కాపర్ తో ఉండే ఏసీలు మెరుగ్గా పనిచేస్తాయి.

ఎయిర్ కండిషనర్ కొన్న తర్వాత సర్వీస్ చాలా ముఖ్యం. మీరు కొనాలనుకుంటే కంపెనీ సర్వీస్ ఎలా ఉందో ముందు చూసుకోండి అలానే ఏసీ ఫీచర్లు కూడా చూసి ఆ తర్వాత కొనుగోలు చేయండి ఇలా ఏసీలు ని కొనుగోలు చేసే ముందు వీటిని తప్పక తెలుసుకొని ఆ తర్వాత మాత్రమే కొనండి.

Read more RELATED
Recommended to you

Latest news