ఏపీలో పొత్తులపై ట్విస్ట్ లు వస్తూనే ఉన్నాయి..చివరికి ఎవరెవరు పొత్తు పెట్టుకుంటారో అర్ధం కాకుండా ఉంది. టిడిపి-జనసేన-బిజేపి పొత్తు పెట్టుకుంటాయా? లేక బిజేపిని వదిలేసి టిడిపి-జనసేన కలుస్తాయా? లేడా బిజేపి-జనసేన కలుస్తాయా? అని పొత్తులపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. టిడిపితో కలవనిదే గెలవడం కష్టమని పవన్ కు తెలుసు. కాకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపిని వదలడం మంచిది కాదు.
అందుకే ఢిల్లీకి వెళ్ళి మరీ టిడిపి-జనసేన-బిజేపి పొత్తు ఉంటే మంచిదని బిజేపి పెద్దలకు చెప్పారు. కానీ బిజేపి పెద్దలు ఏమో..బిజేపి-జనసేన ఓకే గాని టిడిపితోనే కష్టమన్నట్లు ఉన్నారు. టిడిపితో పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా ఎదగలేమనేది బిజేపి వాదన. అందుకు సొంతంగా ఎదగాలని చూస్తున్నామని పవన్ కు బిజేపి పెద్దలు చెప్పారు. అందులో జనసేన కలిసొస్తే మంచిదని భావిస్తున్నారు. ఇక బిజేపి పెద్దలు క్లారిటీ ఇవ్వకపోవడంతో టిడిపితో కలవడంపై పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటానేది చూడాలి. అయితే జనసేనతో కలవడానికి టిడిపి రెడీగానే ఉంది.
అయితే బిజేపితో కలిస్తే నష్టమని భావిస్తున్నారు. ఎందుకంటే ఏపీ ప్రజలు బిజేపిపై కోపంతో ఉన్నారు. అలా అని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపి సపోర్ట్ ఉంటే బెటర్ అనే ఆలోచన చంద్రబాబుకు ఉంది. కానీ బిజేపి ఏమో కలిసిరావట్లేదు. ఇదే సమయంలో ఏపీలో మరో పొత్తు కాంబినేషన్ తెరపైకి వచ్చింది. ఏపీ ప్రజలకు న్యాయం చేయని బిజేపిని పక్కన పెట్టాలని సిపిఐ నారాయణ అంటున్నారు.
అలాగే టిడిపి-జనసేన-సిపిఐ-సిపిఎంలు కలిసి ఎన్నికలకు వెళితే బాగుంటుందని అంటున్నారు. అంటే టిడిపి-జనసేనలతో కమ్యూనిస్టులు కలవాలని చూస్తున్నారు. ఆ దిశగా ప్రతిపాదన పెట్టారు. మరి దీనిపై చంద్రబాబు, పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి. అసలు చివరికి ఎవరెవరు పొత్తు పెట్టుకుంటారో చూడాలి.