ఒంటిమిట్ట బ్రహ్మో త్సవాల్లో భాగంగా జగదభిరాముడు శుక్రవారం ఉదయం కాళీయమర్దన అలంకారంలో భక్తులను కటాక్షించారు. ఉదయం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంక రించి కోదండరామాలయం నుంచి గ్రామ పురవీధుల్లో స్వామివారి వాహనసేవ వైభవంగా నిర్వహించారు. భజన బృందా లు, మహిళలు కోలాటాలు ఆడుతుండగా స్వామి వారు పురవీధుల్లో విహారించారు. వాహనసేవ అనంతరం ఉదయం స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె చందనంతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు. శుక్రవారం రాత్రి స్వామివారు అశ్వవాహ నంపై ఊరేగాడు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి కళ్యాణ మండపం వద్ద ఊంజల్ సేవను శాస్త్రోక్తంగా జరిపించారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టులు, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నటేష్‌బాబు, ఆలయ ఇన్‌స్పెక్టర్ ధనుంజయులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.రామయ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివా రం ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు చక్రస్నానం వైభవంగా జరగనుంది. రాత్రి 7గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 9న ఆదివారం సాయంత్రం పుష్పయాగం వైభ వంగా నిర్వహించనున్నారు.