మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా వస్తుందంటే అంచనాలు ఆకాశమే హద్దుగా ఉంటాయి. అదే చిరు నటించిన ఓ పాన్ ఇండియా సినిమా అంటే ఇక రచ్చ రంబోలానే. చిరు అభిమానుల హంగామా మామూలుగా ఉండదు. ఇక ఇప్పుడు చిరు నటించిన పీరియాడికల్ మూవీ సైరా నరసింహారెడ్డిపై బాలీవుడ్ లో పెద్ద చర్చే జరుగుతోంది.
ఇక ఇటీవల తెలుగు హీరో ప్రభాస్ నటించిన సాహో క్రియేట్ చేసి బజ్.. రెండేళ్ల క్రితం బాహుబలి 2 అయితే విధ్వంసమే సృష్టించింది. దీంతో తెలుగు నుంచి వస్తున్న సైరాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇక సాహో బాలీవుడ్‌లో మాత్రమే హిట్ అయ్యింది. మిగిలిన అన్ని భాషల్లోనూ ప్లాప్ అయ్యింది. దీంతో ఇప్పుడు సైరా విషయంలో ఏం జరుగుతుందా ? అన్న డౌట్లు అందరికి ఉన్నాయి.
ఈ సినిమాపై చిరంజీవి ఎఫెక్ట్, తొలి స్వాతంత్య్ర సమరయోధుడు అనే ట్యాగ్ మాత్రమే ఉంది. ఇంకా చెప్పాలంటే సాహో కథ నేషనల్ వైడ్ అప్పీల్‌తో తెరకెక్కింది. సైరా తెలుగు నేటివిటి ఉన్న కథ మాత్రమే. ఇక సాహో సైతం భారీ బడ్జెట్‌తో తెరకెక్కినా కథ, కథనాల్లో మన ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
అయితే ఆ సినిమా బాలీవుడ్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. మరి ఇప్పుడు సైరా తెలుగు కథ కావడంతో తెలుగు వరకు బాగానే కనెక్ట్ అయినా మిగిలిన భాషల్లో ఎలా ఉంటుందా ? అన్న డౌట్లు ఉన్నాయి. మరి చిరు ఏం చేస్తాడో ? కొద్ది గంటల్లో తేలిపోనుంది.