క్రియేటివ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలోచిరంజీవి హీరోగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా రేపు విడుదల కాబోతుంది. మంగళవారం అర్ధరాత్రి నుంచే ప్రీమియర్ల హంగామా స్టార్ట్ కానుంది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా రు.280 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాకు ఓవరాల్‌గా ఐదు భాషల్లో కలిపి రు.200 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది.
వాస్తవంగా బడ్జెట్‌తో చూస్తే తక్కువ రేట్లకే అమ్మారు. అయితే డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూపంలో మరో రు.120-130 కోట్ల వరకు నిర్మాత రామ్‌చరణ్‌కు ముట్టనున్నాయి. ఇక తెలుగులో ఈ సినిమాకు గోపీచంద్ చాణక్య నుంచి పోటీ ఉంది. అది సైరా రేంజ్ సినిమా కాకపోయినా కొన్ని థియేటర్లు అయినా ఇవ్వాలి. అలా మరీ సోలో అయితే సైరాకు లేదు. ఇక బాలీవుడ్‌లో హృతిక్‌రోషన్, టైగర్ ష్రాప్ వార్ పోటీలో ఉంది.
సైరా సినిమాతో పాటు తమిళంలో రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ధనుష్, వేట్రిమారన్ కాంబినేషన్లో తెరకెక్కిన అసురన్ సినిమా అక్టోబర్ 4వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా తమిళంలో భారీ స్థాయిలో విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటు తెలుగులో నాగ చైతన్య, తమన్నా కలిసి నటించిన 100% లవ్ సినిమా 100% కాదల్ పేరుతో రీమేక్ అయింది. ఈ సినిమాపై కూడా తమిళంలో భారీగా అంచనాలు ఉన్నాయి.
ఇటు తెలుగులో చాణక్య, అటు హిందీలో వార్, తమిళ్ నుంచి రెండు సినిమాలు రేసులో ఉండడంతో సైరాకు బాక్సాఫీస్ రేస్ మరీ వన్‌సైడ్‌గా ఏమీ లేదు. ఈ పోటీని తట్టుకుని చిరు వసూళ్లు సాధించాల్సి ఉంటుంది.