TSPSC పేపర్ లీక్.. దర్యాప్తు నివేదికను హైకోర్టుకు సమర్పించనున్న సిట్

-

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసుతో సంబంధమున్న వారందరినీ బయటకు లాగి విచారిస్తోంది. ఇప్పటికే ప్రధాన నిందితుల నుంచి కీలక ఆధారాలు సేకరించింది. అయితే ఈ నెలరోజుల పాటు దర్యాప్తు సాగించిన సిట్.. ఆ నివేదికను ఇవాళ హైకోర్టుకు సమర్పించనుంది.

సిట్ నివేదికలో టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్, టీఎస్‌పీఎస్‌సీ సెక్రెటరీ, సభ్యుడి వాంగ్మూలాలను అధికారులు పొందుపరిచారు. పేపర్ లీకేజీ కేసులో మొత్తం 17 మందిని సిట్ అరెస్టు చేసింది. కీలక నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్ ,డాక్యా నాయక్​ను సిట్ విచారించిన విషయం తెలిసిందే. ఈ విచారణలో ఏఈ, గ్రూప్-2 పరీక్షా ప్రశ్నాపత్రాలను ప్రవీణ్, రాజశేఖర్ లీక్ చేసినట్లు తెలిసింది. దర్యాప్తు నివేదికలో నిందితుల పెన్​డ్రైవ్, మొబైల్స్​లో ప్రశ్నాపత్రాలు ఉన్న గుర్తించిన ఎఫ్ఎస్ఎల్ నివేదికను కూడా సిట్ జతపరిచింది. ఈ కేసులో సిట్ దాదాపు 150 మందిని విచారించింది.

Read more RELATED
Recommended to you

Latest news