చిరు మెగాస్టార్ ఎందుకు అయ్యాడో ‘సైరా ‘ చూస్తే తెలుస్తుంది..

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత నాలుగు దశాబ్దాలుగా ఎంతో మంది హీరోలు వస్తున్నారు.. పోతున్నారు. ఈ క్రమంలోనే మరి కొందరు స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు.. మరి కొందరు స్టార్ హీరోలుగా అవతరిస్తున్నారు… ఎంత మంది హీరోలు వచ్చి… ఎంత మంది హీరోలు వెళుతున్నా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం పైకి వచ్చిన వ్యక్తుల్లో ముందుగా వినిపించే పేరు మెగా స్టార్ చిరంజీవి. చిన్న హీరో గా కెరీర్ స్టార్ట్ చేసి మెగాస్టార్ కోట్లాది మంది అభిమానుల మనసుల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్న చిరంజీవి ఇదే సినిమా ఇండస్ట్రీలో తన కుటుంబ సభ్యులకు సైతం ఒక దిక్సూచిలా నిలిచి ఓ మార్గాన్ని చూపించారు.

20ల‌లో మొదలైన చిరంజీవి సినిమా ప్రస్థానంలో ఆ వయసులో ఎలాంటి సాహసాలు చేశారో ? ఇప్పుడు ఆరు పదుల వయసులో సైతం సైరా నరసింహారెడ్డి లాంటి చారిత్రాత్మక కథాంశంతో కూడిన ఈ సినిమాలో నటించడం ద్వారా అంతే సాహసం చేశారు. చిరు సినిమాలు చేసేందుకు… సాహసాలు చేసేందుకు వయసు ఏమాత్రం అడ్డు రాదన్న విషయం మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. నటన అంటే ప్రాణం కన్నా మిన్నగా భావించే చిరు తన కెరీర్లోనే తొలిసారిగా ఒక స్వాతంత్య్ర‌ సమర యోధుడు పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్రలో జీవించేందుకు రేయింబవళ్లు నిద్రాహారాలు, తిండి తిప్పలు కూడా మానేసి ఈ భారీ ప్రాజెక్టు కోసం కండ లను కొండలుగా చేసి ఈ సినిమాలో నటించారు చిరంజీవి.

స్వాతంత్య్ర‌ సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవిని త‌ప్ప మ‌రొక‌రిని ఊహించుకోలేనంత గొప్ప‌గా ఆయ‌న చేశారు. ముఖ్యంగా డైలాగ్స్ చెప్పేట‌ప్పుడు, యాక్ష‌న్ సీన్లు చేసే టైంలో చిరు న‌ట‌న‌కు చేతులెత్తి మెక్కాల్సిందే. చిరుకు ఈ సినిమా ప‌ట్ల ఉన్న క‌మిట్‌మెంట్ చేస్తే మెగాస్టార్ ఎందుకు అయ్యాడో ? ప్ర‌తి ఒక్క‌రికి తెలుస్తోంది. ముఖ్యంగా కుర్ర హీరోయిన్లు .. త‌న‌కంటే చాలా చిన్న వ‌య‌స్సులో ఉన్న న‌య‌న‌తార‌, త‌మ‌న్నాతో పోటీ ప‌డి మ‌రీ చిరు చేసిన న‌ట‌నే ఆయ‌న అంకిత భావానికి నిద‌ర్శ‌నం.

Read more RELATED
Recommended to you

Latest news