అందరూ జోరుగా వాడుతున్న ఈ మెయిల్ ఎలా కనిపెట్టారో తెలుసా..?

-

మెయిల్.. ఎలాంటి సమాచారమైనా పైసా ఖర్చు లేకుండా పంపించుకునే సౌలభ‌్యం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఈమెయిల్, జీమెయిల్ వాడని వారు చాలా అరుదు. మరి ఈ సౌకర్యం అసలు ఎలా అందుబాటులోకి వచ్చింది.. ఓసారి తెలుసుకుందాం.

మెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్.. ఈ సౌకర్యం ప్రజలకు 1990ల నుంచి అందుబాటులోకి వచ్చింది. అంతకుమునుపు ఫోన్ లేదా ఉత్తరాల ద్వారా సమాచారం తెలిపేవారు. మెయిల్ ని కని పెట్టింది ఇండియన్ అయిన సబీర్ భాటియా.. మెయిల్ లో మొదట్లో సమాచారం పంపేవారు, పొందేవారు ఇరువురూ ఆన్ లైన్ లో ఉంటేనే దాన్ని చదవడం సాధ్యపడేది.

కానీ క్రమంగా స్టోర్ అండ్ ఫార్వర్డ్ పద్దతి వచ్చింది. దీనివల్ల ఉత్తరం పొందే వ్యక్తి ఆఫ్ లైన్ లో ఉన్నా తర్వాత దాన్ని చదివే సౌకర్యం కలిగింది. ఇందువల్ల ఈ మెయిల్ బాగా ప్రాచుర్యం పొందింది.

చండీఘర్ లో డిసెంబర్ 30, 1968లో పుట్టి, బెంగళూరులో పెరిగిన సబీర్ భాటియా
బాచిలర్స్ డిగ్రీని కాలిఫోర్నియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పొందాడు. తర్వాత  ఏపిల్ కంప్యూటర్స్ లో ఫైర్ పవర్ సిస్టమ్స్ లో హార్డ్ వేర్ ఇంజినీరుగా పనిచేసాడు. తన కొలీగ్ జాక్ స్మిత్ తో కలిసి జులై 4, 1996లో ఈమెయిల్ ప్రొవైడర్‌ను కనుగొన్నాడు. దీనికి అతను హాట్ మెయిల్ అనే పేరు పెట్టాడు.

ఉచితంగా ఈ మెయిల్స్ పంపుకునే ఈ పద్ధతిని ఏప్రిల్ 1999లో ఇతడి నుంచి మైక్రోసాఫ్ట్ కొనుక్కుంది. ఒకప్పుడు ప్రపంచంలో అత్యధిక ఈమెయిల్స్ రిజిస్టర్ అయిన సంస్థ హాట్ మెయిలే. 36.9 కోట్ల మంది దీన్ని ఉపయోగించేవారు. ఇప్పుడు జీ మెయిల్ దీన్ని అధిగమించింది. కాలక్రమేణా ఈమెయిల్ సేవతోపాటు ఛాట్, అటాచ్ మెంట్, రిమైండర్, ఫోల్డర్స్ లాంటివెన్నో సేవలు అదనంగా వచ్చి చేరాయి. ఇదీ ఈ మెయిల్ కథాకమామీషు.

Read more RELATED
Recommended to you

Latest news