చెవిలో అన్ని బొద్దింక‌లా… ఆ యువ‌కుడిని చూసి డాక్ట‌ర్లే షాక్‌

-

సాధార‌ణంగా బొద్దింకలను చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అయితే చెవిలోనే బొద్దింక‌లు ఉంటే.. ఆ న‌ర‌కం మామూలుగా ఉండ‌దు. అయితే చెవిలో కొద్ది రోజులుగా నొప్పి, దురద వస్తున్నాయని ఓ యువకుడు హాస్పిటల్ కి వెళ్లాడు. అత‌ని చెవిలో ఏముందో తెలుసుకోవ‌డానికి పరీక్షించిన వైద్యుడు ఆశ్చ‌ర్య‌పోయారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 26 బొద్దింకలు అతని చెవిలో ఉండటం చూసి డాక్ట‌ర్లు షాక్ అయ్యారు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగింది.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మెల్ బోర్న్ కి చెందిన ఓ యువకుడు లీ(19)కి ఒక రోజు రాత్రి కుడి చెవిలో భరించలేని దురద వచ్చింది. దీంతో హాస్ప‌ట‌ల్‌కు వెళ్లి ప‌రీక్ష‌లు చేయించుకోగా అస‌లు విష‌యం బ‌య‌ట ప‌డింది. అతడి చెవిలో 26 బొద్దింక పిల్లలున్నాయని గుర్తించారు. లీ చెవి మార్గంలో ఎన్నో వారాలుగా బొద్దింక నివసించి గుడ్లు పెట్టిందని, అందుకే అతడి చెవి దగ్గర చర్మం పాడైందని వివరించారు. అతడు సరైన సమయంలో ఆసుపత్రికి వచ్చాడని లేకపోతే చెవి పూర్తిగా దెబ్బతినేదని చేప్పారు. చికిత్స చేసి వాటిని లీ చెవినుంచి వాటిని తొలిగించారు. అయితే ప్రస్తుతం అతనికి ఎలాంటి ప్రమాదం లేదని తేల్చి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news