Samyuktha : మెస్మరైజింగ్​ లుక్స్​తో మాయ చేస్తున్న సంయుక్త

-

కేరళ కుట్టి సంయుక్త మీనన్ తాజాగా విరూపాక్ష సినిమాలో నటించింది. ఇటీవలే ట్రైలర్ విడుదలైన ఈ మూవీ ఏప్రిల్ 21న థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో భాగంగానే చిత్రబృందం ఏలూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్​ను ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్​లో సంయుక్త ట్రెడిషనల్ ఔట్​ఫిట్​లో సందడి చేసింది.

గ్రీన్ కలర్ ఔట్​ఫిట్​లో కళ్లు చెదిరే అందంతో మెస్మరైజింగ్ స్మైల్​తో అందర్నీ ఆకర్షించింది సంయుక్త. చూపుతిప్పుకోనివ్వని గ్లామర్​తో ప్రీ రిలీజ్ ఈవెంట్​లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్​గా నిలిచింది. ఈ వేడుకలో సంయుక్తను చూసి కుర్రాళ్లు మరోసారి మనసు పారేసుకున్నారు. సంయుక్త చాలా క్యూట్​గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక సంయుక్త సినిమాల సంగతికి వస్తే భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్​లో అరంగేట్రం చేసింది ఈ భామ. భీమ్లానాయక్ తర్వాత ఈ బ్యూటీ బింబిసారలో నటించింది. అది కూడా బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ అవ్వడంతో ఈ భామకు వరుస అవకాశాలు వచ్చాయి. ఇటీవలే సార్ సినిమాతో బ్లాక్​బస్టర్ హిట్ కొట్టిన సంయుక్త ఇప్పుడు విరూపాక్ష సినిమాతో మన ముందుకు వస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news