పోస్ట్ ఆఫీస్ స్కీమ్.. రూ.30 పొదుపుతో రూ.5 లక్షలు..!

-

పోస్ట్ ఆఫీస్ ఎన్నో రకాల పథకాల్ని తీసుకు వస్తోంది. పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్స్ వలన ఎన్నో రకాల బెనిఫిట్స్ ని పొందవచ్చు. మనం ఈ స్కీమ్‌ లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ గురించి ఈరోజు తెలుసుకుందాం. భారీ రాబడి వస్తుంది. రిస్క్ లేకుండా రాబడి వస్తుంది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూద్దాం. రూ. 10 వేల పొదుపుతో రూ. 4 లక్షలకు పైగా వస్తాయి. బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్స్‌లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. ఐదేళ్ల చొప్పున మెచ్యూరిటీ కాలాన్ని ఎక్స్టెండ్ చెయ్యచ్చు. ఈ స్కీము పైన 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. మూడు నెలలకు ఒకసారి వడ్డీ మారుతుంది. కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేటును మూడు నెలలకి ఒకసారి మారుస్తుంది.

ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే పన్ను మినహాయింపు ప్రయోజనాలని కూడా పొందొచ్చు. పెట్టిన డబ్బులకు, వచ్చిన వడ్డీకి, విత్‌ డ్రా చేసుకునే మొత్తంపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. రూ. 1.5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ స్కీమ్‌లో గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు డబ్బులని పెట్టవచ్చు. దీనిలో మీరు ప్రతి ఏటా రూ. 10 వేలు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే.. 20 ఏళ్ల టెన్యూర్‌ లో మీ చేతికి ఏకంగా రూ. 4.5 లక్షల వరకు వస్తాయి.

7.1 శాతం వడ్డీ రేటు ప్రకారం అయితే మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం రూ. 2 లక్షలు అవుతుంది. రూ. 2.43 లక్షలు రాబడి మీకు వస్తుంది. రూ. 4.5 లక్షల దాకా మీకు వస్తాయి. ఇలా ఈ విధంగా తక్కువ మొత్తంతోనే అదిరే రాబడి పొందొచ్చు. ఏడాదికి రూ. 10 వేలు అంటే రోజుకు దాదాపు రూ. 27 పొదుపు చెయ్యాలో. అప్పుడు ఏకంగా రూ. 4.5 లక్షల వరకు వస్తాయి. అదే రూ. 12 వేలు కడితే రూ. 5.3 లక్షలు లభిస్తాయి. నెలకు రూ. 1000 పొదుపు చేస్తే చాలు. అంటే రోజుకు రూ. 30 మాత్రమే సేవ్ చేయాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news