ఈ యాంకర్ గుర్తుందా.. ఇప్పుడేం చేస్తోందంటే..?

-

జెమినీ టీవీలో రఘు తో కలిసి తొలి రోజుల్లోనే పోస్ట్ బాక్స్ నెంబర్ 1562 పేరిట ఒక ప్రోగ్రాం చేసిన యాంకర్ అనిత చౌదరి అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఆడియన్స్ రాసిన ఉత్తరాలకు ఓపిగ్గా సమాధానం ఇచ్చే ప్రోగ్రాం ఇది. అప్పట్లో జెమినీ టీవీలో అత్యధిక రేటింగ్ సొంతం చేసుకున్న ఈ ప్రోగ్రాం… భారీగా యాంకర్ కి కూడా గుర్తింపు లభించింది. పదహారాళ్లకే కెరియర్ మొదలుపెట్టిన ఈమె ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడమే కాదు ఈటీవీ, మాటీవీ, జీ తెలుగు ఇలా అన్ని చానల్స్ లో కూడా యాంకర్ గా ఒక రేంజ్ లో తన ప్రోగ్రామ్స్ తో దూసుకెళ్లింది.

ఇకపోతే యాంకర్ గానే కాకుండా సినిమాలలో కూడా అడుగుపెట్టిన అనిత సపోర్టింగ్ రోల్స్ చేస్తూ మరింత ప్రత్యేకంగా పాపులారిటీ సొంతం చేసుకుంది. అలా మురారి, సంతోషం, ఉయ్యాల జంపాల, రారండోయ్ వేడుక చూద్దాం, నీ ప్రేమకై, నువ్వే నువ్వే, ఆనందం వంటి ఎన్నో సినిమాలలో నటించింది. అలా బుల్లితెర, వెండితెర పైన నటించి మంచి పేరు సంపాదించుకున్న అనిత.. కొడుకు పుట్టడంతో అతడి కోసం ఇంట్లోనే ఉంటూ ఇండస్ట్రీకి దూరం అయింది. అంతేకాదు ఒక తమిళ సినిమాలో హీరోయిన్గా కూడా చేసిన ఈమె.. భర్త అమెరికాలో ఉండడం వల్ల కొడుకు బాగోగుల కోసం బుల్లితెరకు దూరమయింది.

అతి చిన్న వయసులోనే తల్లి పాత్రలో నటించిన ఈమె ఉయ్యాల జంపాల సినిమాలో తల్లిగా చేసింది. అమెరికాలో సక్సెస్ఫుల్గా ఉన్నవాళ్లను కలిసి వాళ్ళ జీవితాలను ఈటీవీలో అక్కడి నుంచే చూపిస్తోంది. ఛారిటీ ద్వారా ఎంతోమందికి సేవలు అందిస్తోంది. అమెరికాలో ఉన్నప్పటికీ కూడా తెలుగువారి కోసం యాంకరింగ్ చేస్తున్న ఈమె మళ్లీ సిల్వర్ స్క్రీన్ పైన కనిపిస్తుందా లేదా అన్న ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఏది ఏమైనా మంచి కథ దొరికితే తప్పకుండా వస్తాను అని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news