బెయిల్ పై హై కోర్ట్ నిర్ణయం తర్వాతే విచారణకు వస్తా: ఎంపీ అవినాష్ రెడ్డి

-

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైసీపీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డిని స్వంత గృహంలోనే హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్యలో పాత్రధారులైన వారిని పట్టుకునే పనిలో సీఐడీ బృందం విచారణను వేగవంతం చేస్తోంది. అయితే ఇప్పటికే చాలా మందిని విచారించిన అనంతరం కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని నిన్న ఉదయం సీఐడీ బృందం అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ ను విధించారు. ఈ అరెస్ట్ ను ఖండిస్తూ నిన్నటి నుండి అవినాష్ రెడ్డి సీఐడీ పై వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా అవినాష్ రెడ్డిని కూడా విచారణ చేయడానికి సీఐడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అవినాష్ రెడ్డి విచారణకు హాజరయ్యే ప్రసక్తే లేదు అంటూ కామెంట్ చేశాడు.

తాజాగా ఈయన తెలంగాణ హై కోర్ట్ లో తన ముందస్తు బెయిలు కోసం పిటిషన్ వేశారు. ఈ విషయంలో హై కోర్ట్ తీర్పును వెలువడించిన తర్వాతే… సీఐడీ విచారణకు వెళ్తానని చెప్పాడు. మరి దీనిపై సిఐడి ఏ విధంగా స్పదించనుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news