నేడు సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ పర్యటన

-

నేడు విజయవాడ లో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందు కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం జగన్. ఇందులో బాగంగానే నేడు విజయవాడ లో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు.

అటు సీఎం జగన్‌ అనంతపురం పర్యటన వాయిదా పడింది. సీఎం జగన్ సోమవారం అనంతపురం జిల్లాలో పర్యటించాల్సి ఉండగా, అనివార్య కారణాలవల్ల రద్దయినట్లు కలెక్టర్ గౌతమి ప్రకటించారు. ఇవాళ జరగాల్సిన జగనన్న వసతి దీవెన కార్యక్రమం ఈనెల 26కు వాయిదా పడినట్లు తెలిపారు. ఆ రోజున విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news