కస్టమర్లకు ఎల్ఐసీ నుండి అదిరిపోయే గుడ్ న్యూస్…!

-

ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ తాజాగా గుడ్ న్యూస్ ని అందించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల లో మార్పులు చేసింది. ఇక పూర్తి వివరాలని చూస్తే.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ని మార్చింది. కొత్త వడ్డీ రేట్లు ఇప్పటికే అమలు లోకి వచ్చాయి. ఇక దీని కోసం పూర్తి వివరాలు చూస్తే.. 7.25 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఏడాది నుంచి ఐదేళ్ల వరకు టెన్యూర్‌ కి ఇది వర్తిస్తుంది. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ వెబ్‌సైట్ ప్రకారం చూస్తే..

ఏడాది, 18 నెలలు, 2 ఏళ్లు, 3 ఏళ్లు, ఐదేళ్లు టెన్యూర్‌తో డబ్బులు ని ఎవరైనా దాచుకోవచ్చు.
కమ్యూలేటివ్ పబ్లిక్ డిపాజిట్ స్కీమ్ కింద డబ్బులు ని దాచుకోవచ్చు. రూ. 20 కోట్ల వరకు దీనిలో డబ్బులు దాచుకోవచ్చు. ప్రతీ ఏడాది కూడా ఎఫ్‌డీ అకౌంట్‌లో జమ అవుతాయి. మెచ్యూరిటీ తర్వాతనే చెల్లిస్తారు. ఒకేసారి భారీ మొత్తం పొందొచ్చు. కనీసం రూ. 20 వేలు డిపాజిట్ చేయాలి. రూ. 20 కోట్లలోపు మొత్తంపైన ఒక రకమైన ఎఫ్‌డీ రేటు ని పొందొచ్చు.

ఏడాది టెన్యూర్‌పై 7.25 శాతం పొందొచ్చు. 18 నెలల టెన్యూర్‌పై 7.35 శాతం. 2 ఏళ్ల ఎఫ్‌డీలపై 7.6 శాతం, మూడేళ్ల ఎఫ్‌డీలపై 7.75 శాతం, ఐదేళ్ల ఎఫ్‌డీలపై 7.75 శాతం వడ్డీ వస్తుంది. నాన్ కమ్యూలేటివ్ ఆప్షన్ కి చూస్తే నెల చొప్పున కూడా వడ్డీ మొత్తాన్ని పొందొచ్చు. ఏడాది టెన్యూర్‌పై 7 శాతం, 18 నెలల టెన్యూర్‌పై 7.1 శాతం, రెండేళ్ల టెన్యూర్‌పై 7.35 శాతం, మూడేళ్ల టెన్యూర్‌పై 7.75 శాతం, ఐదేళ్ల టెన్యూర్‌పై 7.5 శాతం ఉంటుంది. అలానే ఆటో రీపేమెంట్ ఆప్షన్ కూడా ఉంది. మెచ్యూరిటీ తర్వాత డబ్బులు నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోకి వచ్చేస్తాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news