పెళ్లి తర్వాత మనస్పర్థలు రావడంతో కలిసి బ్రతకలేము అనుకున్న జంటలు విడాకులు తీసుకుంటారు..అయితే విడాకులు తీసుకొని విడిపోయాక చాలా మంది ఈ విషయాన్ని బయటకు చెప్పుకోరు.. కొంచెం భయం, కొంచెం సిగ్గుతో దాస్తారు.. అందుకు భిన్నంగా ఆలోచించాడు.. తన ఆనందాన్ని తట్టుకోలేక పోయాడు.. విడాకులు తీసుకున్నామనే బాధలో కూడా ఉంటారు. కానీ లండన్ లోని అంగస్ కెన్నెడీ అనే వ్యక్తి తన భార్య సోఫీతో విడాకులు తీసుకున్న తర్వాత కార్లో తిరుగుతూ సెలబ్రెట్ చేసుకున్నాడు. అంతేకాదు కారు వెనకాల జస్ట్ డివోర్స్డ్ అని రాసుకుని డార్ట్ఫార్డ్ ప్రాంతంలో రౌండ్లు వేశాడు.
అయితే ఇలా ఎందుకు చేశాడంటే తన భార్య నుంచి విడాకులు తీసుకున్నాక ఇక తాను సింగిల్ అని ఇతరులకు తెలియజేసేందుకు ముఖ్యంగా అమ్మాయిలను ఆకర్షించేదుకు ఇలా రోడ్లపై చక్కర్లు కొట్టాడు..విడాకులు తీసుకున్నంత మాత్రాన విచారంగా, బాధగా ఉండల్సిన అవసరం లేదని.. మళ్లీ ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి చేసుకోవాల్సిన వేడుక లాంటిదేనని అంగస్ తెలిపాడు.. అంతేకాదు తన భార్యతో ఒక బంధం మాత్రమే విడిపోయింది.. కానీ మేము ఇప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చాడు..
2004లో అంగస్, సోఫీ లు వివాహం చేసుకున్నారు. 2021 జులైలో పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో వాళ్ల విడాకులు ఖరారయ్యాయి. అలాగే వాళ్లిద్దరికి ఉన్న ఐదుగురు పిల్లలను కూడా కలిసి పంచుకుంటున్నారు. అయితే అంగస్ అలా కారులో తిరగడంపై అతని మాజీ భార్య సోఫీ కూడా స్పందించింది. అతను అలా చేయడం సరదాగా ఉందని..విడాకులు తీసుకున్న తర్వాత కూడా స్నేహితులుగా ఉండటం సాధ్యమేనని, తన పిల్లలకు చూపించేందుకు ఈ విడాకులు తీసుకున్నట్లు పేర్కొన్నారు.. మొత్తానికి ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..