వ‌న‌ప‌ర్తిని వ‌ణికిస్తోన్న క‌మ్మ‌రి రాజు… చంపి ర‌క్తం తాగ‌డ‌మే అల‌వాటు

-

వనపర్తి జిల్లా, అమరచింత మండలం, సింగపేట గ్రామానికి చెందిన కమ్మరి రాజు అనే వ్య‌క్తి అక్క‌డ ప్ర‌జ‌ల‌కు వ‌ణుకు పుట్టిస్తున్నాడు. అత‌డు సామాన్యుడే. మూడేళ్ల క్రితం బాగానే ఉండేవాడు. అందరితో కలిసి మెలసి తిరిగేవాడు. ఆ తర్వాత అతనికి ఏమైందో తెలియదు గానీ రక్తానికి మరిగాడు. ఈ క్ర‌మంలోనే తనకు ఎదురైన మేకల్ని ఎత్తుకొని వెళ్లే అతగాడు.. వాటి మెడను కొరికేసి.. రక్తాన్ని తాగేస్తాడు. ఉదయాన్నే తాను చంపిన మేకను తన భుజం మీదకు వేసుకొని వచ్చి.. సదరు మేక యజమాని ఇంటి దగ్గర పడేసి తన దారిన తాను పోతాడు.

ఇప్పటివరకూ 60 మేకల్ని ఇదే రీతిలో చంపి..రక్తాన్ని తాగేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు మేకల్ని ఇలా చేస్తున్న ఇతడు.. చిన్న పిల్లల్ని చేస్తే సంగతేమిటన్న ఆందోళన ఎక్కువ అవుతోంది. బాధితులు రాజు తల్లిదండ్రులకు విషయం చెప్పి నష్టపరిహారం కింద డబ్బులు తీసుకునేవారు. ఈ మధ్యన భారం పెరిగిపోవటంతో తమ వల్ల కాదని వారు చేతులు ఎత్తేస్తున్నారు. అయితే తన ప్రవర్తనపై అతను స్పందిస్తూ.. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నానో తనకే తెలియదని రాజు అంటున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ గ్రామానికే ప‌రిమితం అయిన రాజు జిల్లాలోనే హాట్ టాపిక్‌గా మారాడు.

Read more RELATED
Recommended to you

Latest news