ఎడిట్ నోట్: బాబు@సీఎం.!

-

చంద్రబాబు అంటే సీఎం..అదేదో ఆయన ఇంటిపేరు అన్నట్లు సీఎం పదవి మారింది..అయితే ఇదంతా 1999 కాలంలో ఎందుకంటే వరుసగా రెండుసార్లు సీఎం..దీంతో అంతా సి‌ఎం చంద్రబాబు,..సి‌ఎం చంద్రబాబు అంటూ అలవాటు అయిపోయింది. అందుకే ఆయన ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన సరే..చాలామంది చంద్రబాబు అంటే సి‌ఎం అనుకునే పరిస్తితి. ఆఖరికి గత ఎన్నికల్లో జగన్ గెలిచి అధికారంలోకి వచ్చి, సి‌ఎం సీటులో ఉంటూ కూడా సి‌ఎం చంద్రబాబు అని బై మిస్టేక్ ప్రస్తావించారు..అంటే ఆయనకు సి‌ఎం అనే ముద్ర అలాగే ఉండిపోయిందనే చెప్పాలి.

ఇక గత కొంతకాలంగా సి‌ఎం పదవికి దూరమై, ప్రతిపక్షంలో చంద్రబాబు మరోసారి సి‌ఎం పదవి కోసం కష్టపడుతున్నారు. కరెక్ట్ గా మళ్ళీ ఆయన పుట్టినరోజుకు సి‌ఎం సీటు లో కూర్చుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా రాజకీయాల్లోకి వచ్చి..మొదటసారి పోటీ చేసిన వెంటనే ఎమ్మెల్యేగా గెలిచి…మంత్రి కూడా అయ్యారు. అయితే ఇదంతా కాంగ్రెస్ లో జరిగింది.

ఇక టి‌డి‌పి చేతుల్లోనే బాబుకు తొలిఓటమి ఎదురైంది..ఆ తర్వాత ఎన్టీఆర్ అల్లుడు అవ్వడం, టి‌డి‌పిలోకి రావడం..ఇంకా అక్కడ నుంచి బాబు ప్రస్థానం అందరికీ తెలిసిందే. ఇక ఆయన జీవితంలో కీలకఘట్టం 1995..సి‌ఎంగా ఉన్న తన మామ ఎన్టీఆర్‌ని గద్దె దించి…తాను సి‌ఎం సీటులోకి వచ్చారు. అయితే టి‌డి‌పిని కొందరు దుష్టశక్తులు నాశనం చేస్తున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్తితుల్లో తాను ఎన్టీఆర్‌ని తప్పించి సి‌ఎం సీటులో కూర్చోవాల్సి వచ్చిందని బాబు ఇప్పటికీ చెబుతుంటారు.

కానీ ఎన్టీఆర్‌కు బాబు వెన్నుపోటు పొడిచారని ప్రత్యర్ధులు ఇప్పటికీ విమర్శలు చేస్తున్నారు. ఎన్ని విమర్శలు ఉన్నా ఆయన పాలన మెచ్చి 1999 ఎన్నికల్లో మళ్ళీ పట్టం కట్టారు. ఇక 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయియా ప్రతిపక్షానికి పరిమితమైన పార్టీని నిలబెట్టి, మళ్ళీ 2014 ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలై మళ్ళీ పోరాడుతున్నారు. సి‌ఎం పీఠంలో కూర్చోవాలని కష్టపడుతున్నారు.  చూద్దాం మరి నెక్స్ట్ పుట్టినరోజుకు ఆయన సి‌ఎం సీటుకు దగ్గరవుతారేమో.

Read more RELATED
Recommended to you

Latest news