మహిళపై బాలీవుడ్ నటుడు షాహిల్ ఖాన్ వేధింపులు.. రంగంలోకి ముంబై పోలీసులు..

-

బాలీవుడ్ నటుడు షాహిల్ ఖాన్ పై కేసు నమోదు అయింది గత కొన్నాళ్లుగా తనను వేధిస్తున్నారు అంటూ షాహిర్ ఖాన్ తో పాటు మరో మహిళపై ఒక మహిళ చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసును నమోదు చేశారు.

గత కొన్ని నాలుగ తనను బెదిరించడంతో పాటు తన గౌరవానికి భంగం కలిగించే చర్యలకు ప్రముఖ బాలీవుడ్ నటుడు షాహిద్ ఖాన్ తో పాటు మరొక మహిళ పాల్పడుతున్నారు అంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై స్పందించిన ముంబై పోలీసులు వీరిద్దరిపై ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు.

Sahil Khan accused of extortion, death threat to woman at Mumbai gym ...

వివరాల్లోకి వెళితే.. ఓషివారా ఏరియాకు చెందిన 43 ఏళ్ల బాధిత మహిళను డబ్బులు విషయంలో ఒక మహిళ ఫిబ్రవరిలో తనతో జిమ్ లో గొడవ పడింది. ఆ సమయంలో నటుడు సాహిల్ ఖాన్, సదరు మహిళ ఆమెను దుర్భాషలాడారు. బెదిరింపులకు పాల్పడ్డారు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి ఆ మహిళ పరువు తీయటానికి ఆమె కుటుంబంకు సంబంధించిన పలు విషయాలు సైతం సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టారని ఆ మహిళ తెలిపింది. ఈ విషయంపై వారిని ప్రశ్నించగా పలు మార్లు తనపై దాడికి సైతం ప్రయత్నించారని చెప్పుకొచ్చింది. ఇలా తన గౌరవానికి భంగం కలిగించారని ఎఫ్ఐఆర్లో పేర్కొంది.. కాగా మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. పలు సెక్షన్స్ క్రింద సాహిల్ ఖాన్, అలాగే మరో మహిళ మీద ఓషివారా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కాగా సహిల్ ఖాన్ స్టైల్, ఎక్స్క్యూజ్ మీ, అల్లావుద్దీన్ అండ్ రామా వంటి పలు హిందీ చిత్రాల్లో నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news