ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని బంధించి, ప్రైవేట్ భాగాలపై వేడీ నూనె పోసాడు ఓ యువకుడు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… ఏలూరు..పెదవేగి మండలం దుగ్గిరాలలో ఈ దారుణం జరిగింది. ప్రేమ పేరుతో కంచర్ల ప్రియాంక అనే ఇంజనీరింగ్ విద్యార్థినిని బంధించి, చిత్ర హింసలకు గురి చేశాడు అనుదీప్ అనే యువకుడు.
అంతేకాదు, గదిలో బంధించి ఆ యువతి ప్రైవేట్ భాగాలపై వేడీ నూనె పోసి, చిత్ర హింసలు చేశాడు అనుదీప్. అయితే, చాలా చాక చక్యంగా అనుదీప్ నుంచి…తప్పించుకుని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది యువతి. చేతులు, కాళ్లపై గాయాలు కావడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది ప్రియాంక. అటు ప్రియాంక తల్లిదండ్రులు, అనుదీప్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.