Samyuktha Menon : సంయుక్త మీనన్‌ లేటెస్ట్ గ్లామరస్‌ ఫోటోస్‌

-

సౌత్ లో మరే పరిశ్రమకు సాధ్యం కాని విధంగా కేరళ నుంచి చాలామంది హీరోయిన్లు వస్తూ ఉంటారు. అందులోంచి వచ్చిన కేరళకుట్టి సంయుక్త మీనన్. మలయాళం అలాగే తమిళం తో పాటు కన్నడలోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తాజాగా పవన్ కళ్యాణ్, రానా హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా, బింబిసార, సార్‌ సినిమాలలో తలుక్కున మెరిసింది.

భీమ్లా నాయక్ మూవీలో దగ్గుబాటి రానా సరసన హీరోయిన్గా నటించింది. సంయుక్త మీనన్ 2016 సంవత్సరంలో మలయాళం మూవీ పాప్ కార్న్ హీరోయిన్ గా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో చేసిన అంజనా పాత్ర ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది.

మలయాళంలో యాక్ట్ చేస్తూనే తమిళంలోనూ కలరీ ఈ సినిమాతో పలకరించింది. ఇక ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సినిమా అయిన భీమ్లా నాయక్ లో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో సంయుక్త మీనం… ఎంతో అనుభవం ఉన్న నటిగా యాక్టింగ్ చేసింది. నిత్యామీనన్ కు పోటీగా నటించి శభాష్ అనిపించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news