మేం తెలంగాణ ఉద్యమంలో ఉంటే, నువ్వు చంద్రబాబు పక్కలో చేరావని రేవంత్ రెడ్డిపై ఈటల సీరియస్ అయ్యారు. నిన్న రేవంత్ రెడ్డి కంట తడి పెట్టిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై ఈటల స్పందించారు.సింగరేణి పై నేను మాట్లాడిన… నేను ఎవరి పైన వ్యక్తిగతంగా మాట్లడలేదని తెలిపారు. ఢిల్లీ కేంద్రం గా జాతీయ పార్టీ లు రాజకీయాలు చేస్తాయని అన్నానని.. బీజేపీని ఇరకాటం లో పెట్టేందుకు brs, కాంగ్రెస్ చెట్టాపట్టాలేసుకున్నాయని ఫైర్ అయ్యారు.
ఖర్గే, kk కలిసి మాట్లాడతారని.. రాహుల్ గాంధీ సూరత్ కోర్ట్ తీర్పు పై brs ఆయనకు మద్దతుగా మాట్లాడిందని నిప్పులు చెరిగారు. వీరుడు, దీరుడు ఎప్పుడు కన్నీరు పెట్టడు…రేవంత్ రెడ్డి కన్నీరు పెడుతూ సంస్కార హీనంగా మాట్లాడారని ఆగ్రహించారు. నేను విద్యార్థి దశలోనే రెండు సార్లు జైలు కు వెళ్లానని.. మేము తెలంగాణ గురించి కొట్లాడినప్పుడు రేవంత్ ఎక్కడ ఉన్నావు…అని ప్రశ్నించారు.