IRCTC నుండి కొత్త ప్యాకేజీ.. హైదరాబాద్ టు అండమాన్ .. ధర కూడా తక్కువే..!

-

వేసవి వచ్చేసింది. వేసవిలో సరదాగా ఎక్కడికైనా టూర్ వెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే ఈ ప్యాకేజీని చూడాల్సిందే. సమ్మర్‌లో ఎక్కడికి అయినా వెళ్లాలని అనుకునే వాళ్లకి గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ టూరిజం ఎన్నో రకాల ప్యాకేజీలని తీసుకు వచ్చింది. ఈ ప్యాకేజీల ద్వారా సూపర్ టూర్ వేసేయచ్చు. ‘అమేజింగ్ అండమాన్’ పేరుతో ఓ టూర్ ప్యాకేజీ ని తీసుకొచ్చింది. ఇక మరి దాని కోసం పూర్తి వివరాలని చూసేద్దాం. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. సమ్మర్‌ లో అండమాన్ టూర్ వెళ్లాలనుకునేవారికి ఈ టూర్ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. ఏప్రిల్ 29, మే 26 తేదీల్లో ఇది అందుబాటులో ఉంటుంది.

 

ఈ టూర్ ప్యాకేజీలో పోర్ట్‌బ్లెయిర్, హేవ్‌లాక్ ఐల్యాండ్, నీల్ ఐల్యాండ్, రాస్ ఇవన్నీ కూడ కవర్ అవుతాయి. హైదరాబాద్‌లో ఈ టూర్ మొదలు అవుతుంది. ఉదయం 6.35 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 9.15 గంటలకు పోర్ట్‌బ్లెయిర్ కి చేరుతారు. అదే రోజు సెల్యులార్ జైల్ మ్యూజియం సందర్శన ఉంటుంది. కార్బిన్స్ కోవ్ బీచ్‌కు వెళ్ళచ్చు. సాయంత్రం సెల్యులార్ జైలులో లైట్ అండ్ సౌండ్ షో చూడొచ్చు. రాత్రికి పోర్ట్ బ్లెయిర్‌లో ఉండాలి. రెండో రోజు హేవ్‌లాక్ ఐల్యాండ్ క్రూజ్‌ ట్రిప్ ఉంటుంది. రాధానగర్ బీచ్ చూడొచ్చు. రాత్రికి హేవ్‌లాక్‌లో ఉండాలి.

మూడో రోజు కాలాపత్తర్ బీచ్‌కు వెళ్ళచ్చు. నీల్ ఐల్యాండ్‌కు వెళ్లాలి. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత లక్ష్మణ్‌పూర్ బీచ్‌కు వెళ్ళచ్చు. ఇక నాల్గవ రోజు భరత్‌నగర్ బీచ్‌కు వెళ్లాలి. స్విమ్మింగ్, గ్లాస్ బాటమ్ బోట్ రైడ్, వాటర్ స్పోర్ట్స్, ఇతర యాక్టివిటీస్ ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఆ తర్వాత పోర్ట్ బ్లెయిర్ తీసుకెళ్తారు. అలానే ఐదో రోజు రాస్ ఐల్యాండ్‌కు వెళ్లాలి. నార్త్ బే ఐల్యాండ్ చూడొచ్చు. అక్కడ సొంత ఖర్చులతో వాటర్ స్పోర్ట్స్, యాక్టివిటీస్ లో పాల్గొనవచ్చు. ఆరో రోజు తిరుగు ప్రయాణం ఉంటుంది. ఇక ధర విషయానికి వస్తే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి ధర రూ.42,885, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.43,170, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.55,780 గా వుంది.

Read more RELATED
Recommended to you

Latest news