తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త చెప్పింది టిటిడి పాలకమండలి. ఇవాళ తిరుమల వర్చువల్ సేవా టిక్కెట్లు కలిగిన భక్తులకు దర్శన టిక్కెట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ పాలక మండలి. ఇందులో భాగంగానే ఇవ్వాలా ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించిన టిక్కెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి.
అలాగే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జూన్ నెలకు సంబంధించిన టిక్కెట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ. అంతేకాదు తిరుమల భక్తులకు మరో శుభవార్త చెప్పింది టిటిడి పాలకమండలి. రేపు ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ పాలక మండలి.