ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తనను వేధించాడంటూ అతని భార్య రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. నవాజుద్దీన్ భార్య ఆలియా వీరిద్దరి మధ్య జరుగుతున్న గొడవలని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ వచ్చింది. తనను తన పిల్లల్ని ఎంతగానో నవాజుద్దీన్ అతని కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని చెప్పుకు వచ్చిన ఆలియా విషయంలో తాజాగా కోర్టు ఆమెకు సానుకూలంగా తీర్పు ఇచ్చినట్టు తెలుస్తోంది..
బాలీవుడ్ లో తన నటనతో మంచి పేరు తెచ్చుకున్న నటుడు నవాజుద్దీన్. కాగా తనను వేధింపులకు గురిచేశారని అతని భార్య ఆలియా తన భర్త, అతడి తల్లి సోదరులపై తీవ్రంగా ఆరోపించారు. మరో సంఘటనలో ఆస్తి వివాదంపై నవాజుద్దీన్ తల్లి కోడలిపై ఫిర్యాదు చేయడంతో అతడు ఇంట్లో తనను వేధించారని పేర్కొంది. అయితే కోర్టు వారిద్దరినీ కూర్చుని అన్ని సమస్యలను చర్చించడం ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆదేశించినట్లు సమాచారం.
ఆలియా ఈ విషయంపై మాట్లాడుతూ కోర్టు ఏం ప్రస్థావించిందో వెల్లడించారు. ” నాకు పిల్లలకు సంబందించిన సమస్యలన్నింటినీ క్లియర్ చేయాలని కోర్టు నవాజ్ ను ఆదేశించింది. దుబాయ్ లో అన్నీ తానే చూసుకోవాలని పిల్లలకు ఎలాంటి సమస్యలు రాకూడదని షరతు విధించింది. అతడు ఆ కోర్టు ఆదేశాలపై పనిచేశాడు. అందుకే నేను పిల్లలతో కలిసి దుబాయ్ కి వచ్చాను.. కాగా దుబాయ్ ఆర్థికంగా ఖరీదైనది. అక్కడ నివసించడం అంత సులభం కాదని ఆలియా అన్నారు
అలాగే ఈ విషయంపై మాట్లాడుతూ.. ”గొడవల నడుమ చాలా ఆర్థిక సమస్యలు ఉన్నందున దుబాయ్ లో నివసించడం సులభం కాదు. అయితే నవాజ్ తన విధులన్నింటినీ నిర్వర్తించాలని మమ్మల్ని మంచి స్థితిలో ఉంచాడని నిర్ధారించుకోవాలని కోర్టు చాలా మంచి తీర్పును ఇచ్చింది. ఎట్టకేలకు ఆ సమస్యలన్నింటినీ నవాజ్ పరిష్కరించాడు. కోర్టు నిర్ణయాన్ని పిల్లలకు వదిలివేసింది. దుబాయ్ లేదా భారతదేశంలో వారు కోరుకున్న చోట ఉండగలరు. అయితే ముందుగా దుబాయ్ లో చదువులు పూర్తి చేయాలి..” అన్నారు..
అలాగే ఇందుకోసం పిల్లలు దుబాయ్ లో మూడు నెలలు ఉండనున్నారని ఆ తర్వాత ఎక్కడికి స్థిరపడాలో నిర్ణయించుకుంటామని ఆలియా తెలిపింది. ఇంకా విడాకుల కోసం దరఖాస్తు చేసాను.. కానీ దానికంటే ముందు మేం ఎక్కడ నిలబడతామో కూర్చుని చర్చించుకోవడం ముఖ్యం. ఎందుకంటే అది కోర్టు మాకు ఆదేశించింది. కోర్టు వెలుపల విషయాలు పరిష్కరించుకోవాలని మమ్మల్ని కోరింది. ప్రస్తుతం నవాజ్ షూటింగ్ విషయంలో వేరే దేశంలో ఉండటం వల్ల అతను వచ్చిన తర్వాత కోర్టులో కోర్టు మిగిలిన విషయాలని సామరస్యంగా కూర్చొని మాట్లాడమని చెప్పుకొచ్చింది.. అంటూ తెలిపారు ఆలియా..