దేశ ప్రజలతో నా భావోద్వేగ బంధానికి కారణం రేడియోనే : ప్రధాని మోదీ

-

దేశ ప్రజలతో తనకు భావోద్వేగ బంధం ఏర్పడటానికి గల కారణం రేడియోనేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్‌ కీ బాత్‌ కార్యక్రమం ద్వారానే ఇది సాధ్యమైందని తెలిపారు. ఈ బంధానికి రేడియోనే కారణం కాబట్టి, ఒక విధంగా తానూ ఆలిండియా రేడియో బృందంలో ఒకణ్నేనని అన్నారు.

‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం ఈ ఆదివారం నాటికి 100వ ఎపిసోడ్‌కు చేరుకోబోతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ శుక్రవారం దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 85 జిల్లాల్లో 91 చోట్ల 100 వాట్ల సామర్థ్యం గల ఎఫ్‌ఎం రేడియో ట్రాన్స్‌మిటర్లను ప్రారంభించారు. ఫలితంగా ఆకాశవాణి ట్రాన్స్‌మిటర్ల సంఖ్య 524 నుంచి 615కు చేరింది. ఈ అదనపు సౌకర్యాల కల్పనతో ఆకాశవాణి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా మొత్తం 73.5% జనాభాకు అందుబాటులోకి వస్తాయి. కొత్త ట్రాన్స్‌మిటర్ల ఏర్పాటులో మారుమూల జిల్లాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లోని జిల్లాలూ ఉన్నాయి. కొత్త ట్రాన్స్‌మిటర్లతో ఆకాశవాణి కార్యక్రమాలను కొత్తగా 2 కోట్ల మంది వినడానికి వీలవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news