నా టికెట్ నేనే ప్రకటించుకుంటున్నా..నల్గొండ నుంచే పోటీ చేస్తానని రేవంత్ రెడ్డి సమక్షంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించుకున్నాడు. పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా నల్లగొండకు వచ్చిన రేవంత్ రెడ్డికి స్వాగతం తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలు, లక్షణంగా ఏర్పడిన తెలంగాణలో నీళ్లను జగన్మోహన్ రెడ్డికి వదిలేశారు…1000 కోట్లు కేటాయిస్తే పూర్తయ్యే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహించారు.
జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులపై బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని.. 2014లో ఒకసారి కేసీఆర్ మాటలకు మోసపోయామని వివరించారు. 2018 లో రైతుబంధు పథకం తీసుకొచ్చి రెండోసారి కేసీఆర్ మోసం చేశారు.. మూడోసారి మోసపోవద్దన్నారు. దళిత బందు నగదు బదిలీలో అవినీతికి పాల్పడిన చిట్టా మీ దగ్గర ఉంటే ఆ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలి.. తినడానికి తిండి లేని మంత్రి జగదీశ్ రెడ్డికి 80 ఎకరాల ఫామ్ హౌస్ ఎలా వచ్చిందని వెల్లడించారు. సీనియర్ నాయకుడైన నేను, మా ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి ఇప్పటికి అద్దె ఇళ్లలోనే ఉంటున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్లిన నకిరేకల్ ఎమ్మెల్యే సైతం అక్రమ ఆస్తులు సంపాదించాడు..ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే ఉద్దేశంతో ప్రభుత్వం నోటిఫికేషన్లో ఇచ్చినట్లు కనిపించడం లేదని ఆగ్రహించారు.