తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. రానున్న 5 రోజులు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలే ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో రానున్న ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, బొంబాయి, గద్వాల జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఇక అటు హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి నుంచి వర్షం పడుతూనే ఉంది. ఈ భారీ వర్షానికి ఓల్డ్ ఎంఎల్ఏ క్వార్టర్స్ హైదర్గూడా, బాగ్ లింగంపల్లి. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద భారీగా వర్షపు నీరు..నిలిచిపోయింది. దీంతో జనం.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.