మే 3న హైదరాబాద్‌లో నీరా కేఫ్ ప్రారంభం కానుంది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్ ను మంత్రి కేటీఆర్ మే 3 న ప్రారంభించనున్నారు.
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. రూ.13 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోనే తొలిసారి నీరా కేఫ్ ను ఆధునిక హంగులతో నిర్మించిన విషయం తెలిసిందే.