దువ్వాడ జగన్నాథం 100కోట్ల వివాదంపై ఇన్నాళ్లకు నోరు విప్పిన దిల్ రాజు..

-

Duvvada Jagannath: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం దువ్వాడ జగన్నాథం. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమాపై అప్పటి నుంచి ఒక వివాదం నడుస్తూనే వస్తుంది. సినిమా విడుదలైన కొన్ని రోజులకే 100 కోట్ల గ్రాస్ సాధించినట్టు పోస్టర్ వేయటంతో వివాదాస్పదంగా మారింది. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు నిర్మాత దిల్ రాజు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా నటించిన చిత్రం దువ్వాడ జగన్నాథం. 2017 జూన్ 23న విడుదలైన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. కలెక్షన్స్ పరంగా సూపర్ హిట్ అయింది. 100 కోట్ల గ్రాస్ అందుకున్నట్టు అప్పట్లో దిల్ రాజు ప్రకటించడం వివాదాస్పదంగా మారగా ఇన్నేళ్లకు ఈ విషయంపై స్పందించిన దిల్ రాజు.. తాను తన సినిమాలకి పెద్దగా కలెక్షన్స్ పోస్టర్స్ అనౌన్స్ చేయనని.. కానీ డీజే చిత్రానికి చేయడంతో అంతా చాలా గందరగోళంగా మారింది అని అన్నారు. అయితే డీజే చిత్రానికి నిజంగానే 100 కోట్లు వచ్చాయి కాబట్టే 100 కోట్ల పోస్టర్ వేశామని అందులో ఎలాంటి అబద్దం లేదని క్లియర్ గా చెప్పేసారు. డీజే చిత్రానికి వచ్చిన వసూళ్ళలో ఎలాంటి అబద్దం లేదని అందరికీ కన్ఫర్మ్ ఇచ్చేశారు.

Duvvada Jagannath
Duvvada Jagannath

కాగా ఈ సినిమా రిలీజ్ సమయంలో వీకెండ్స్ తో పాటు రంజాన్ సెలవులు కలిసి రావడంతో ఐదురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా డీజే వంద కోట్ల గ్రాస్ వసూలు చేసిందని చెప్పారు. 78 కోట్ల షేర్ రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను పంచిందని ట్రేడ్ తేల్చింది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ న్యూ లుక్ తో కనిపించారు. అగ్రహారంలో బ్రాహ్మణుడిగా, స్టైలిష్ కిల్లర్గా డిఫరెంట్ పాత్రలో ఆకట్టుకున్నారు. బ్రాహ్మణ అబ్బాయిగా బన్నీ ఈ సినిమాలో చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ అదరహో అనిపిస్తాయి. పంచెకట్టులో పద్దతిగా కనిపించినా మాస్ మసాలా సీన్స్ లోనూ ఇరగదీశాడు. హీరోయిన్ పూజ హెగ్డే గ్లామర్ షో, రావు రమేశ్‌ విలనిజం, దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ ఇలా అన్ని కలగలిపి ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచేలా చేశాయి.

Read more RELATED
Recommended to you

Latest news