కాంగ్నిజెంట్‌లో భారీగా లేఆఫ్స్‌.. ఉద్యోగులను తీసేసి ఆఫీస్‌ స్పేస్‌ను రెంట్‌కు ఇస్తారట

-

కరోనా కారణంగా.. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఉద్యోగులు దెబ్బమీద దెబ్బ తగులుతుంది.. మొదట కాస్ట్‌ కటింగ్‌ అన్నారు.. ఆ తర్వాత లేఆఫ్స్‌, ఓపినింగ్స్ ఆపేశారు.. ఇదీ చాలనట్లు.. హైక్‌లు కూడా ఈ ఏడాది ఇవ్వలేదు.. పెద్ద పెద్ద కంపెనీలు సైతం.. ఉద్యోగులను తొలగించుకుంది.. తాజాగా కాంగ్నిజెంట్‌ కూడా భారీగా లేఆఫ్స్‌ ప్రకటించింది. నెక్ట్స్ జెనరేషన్ ప్రోగ్రాంలో భాగంగా భారీగా కోతలు ఉండే అవకాశముందని కాగ్నిజెంట్ సీఈవో ఎస్. రవికుమార్ తెలిపారు. ఆపరేటింగ్ మోడల్‌ను సులభతరం చేసుకునేందుకు కార్పొరేట్ విధులను సక్రమంగా నిర్వహించుకునేందుకు పలు చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు.

ప్రపంచ ఐటీ సంస్థలపై ఆర్ధిక మాంధ్యం ఎఫెక్ట్ గట్టిగానే పడుతోంది. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగాలకు కోత పెట్టాయి. రానున్న రెండు, మూడేళ్ల పాటూ ఇదే తంతు కొనసాగే అవకాశం ఉన్నట్లు అంచనా. ఆర్ధికభారం తగ్గించుకునేందుకు ఉద్యోగుల్లో కోత పెట్టేందుకు వెనుకాడటం లేదు ముఖ్యమైన కంపెనీలు. కాంగ్నిజెంట్‌లో భారీగా ఉద్యోగులకు ఉద్వాసన, ఆదాయం తగ్గడంలో 3500 మంది ఉద్యోగులను తొలగించే యోచన, ఆఫీస్ స్పెస్‌ను అద్దెకు ఇచ్చి ఆదాయం సమకూర్చుకోవాలని కంపెనీ ప్లాన్‌ చేస్తుంది.

ఆపరేటింగ్ మోడల్‌ను సులభతరం చేసుకునేందుకు కార్పొరేట్ విధులను సక్రమంగా నిర్వహించుకునేందుకు పలు చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా దాదాపు 3500 మంది ఉద్యోగులను తొలగించే అవకాశమున్నట్లు సమాచారం.. 2023 సంవత్సరంలో తమ కంపెనీ రెవిన్యూ భారీగా తగ్గే అవకాశముందని రవికుమార్ అంచనా. ప్రపంచవ్యాప్తంగా 14 మిలియన్ల ఉద్యోగాల కోత, 2027 నాటికి అందరూ రోడ్డు మీదకు వస్తారని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నివేదికలో తెలిపింది.

పెద్ద ఎత్తున కాగ్నిజెంట్ (Cognizant) ఆఫీస్ స్పెస్‌ను అద్దెకు ఇచ్చే యోచనలో ఉంది. కంపెనీ ఉద్యోగుల్లో ఒకశాతం మందిపై లే ఆఫ్స్ ఎఫెక్ట్ పడనుంది. కాగ్నిజెంట్‌లో ప్రస్తుతం దాదాపు 3లక్షల 51వేలమందికి పైగా ఉద్యోగులున్నారు. ఇందులో చాలా మంది వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నారు.. ఇప్పుడు కంపెనీ ఏ ప్రాతిపదికన ఉద్యోగులను తీస్తుందో.. ఏది ఏమైనా.. ఐటీ రంగ కుదేలైంది.. ఉద్యోగాలకు నమ్మకం లేదు.. ఏ రోజు లేఆఫ్‌ మేల్‌ చూడాల్సి వస్తుందో అన్న ఆందోళన అందరిలో ఉంది. ప్రశాంతంగా వర్క్‌ లేదు, జీవితం అంతకన్నా లేదు.. ఈ పరిస్థితి ఇంకెంతకాలమో..!

 

Read more RELATED
Recommended to you

Latest news