పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ : సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సమంత.. !

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న సమంతా తాజాగా అరుదైన రికార్డు క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇండియన్ మూవీ డేటా బేస్ వాళ్ళు విడుదల చేసిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో సమంత మొదటి స్థానంలో నిలిచింది. గతంలో తొమ్మిదో స్థానంలో ఉన్న ఈమె ఈసారి మొదటి స్థానానికి చేరుకోవడం నిజంగా ప్రశంసనీయం అని చెప్పాలి. తెలుగులో అగ్ర కథానాయకగా కొనసాగుతున్న సమంత ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. స్టార్ హీరోలకు మించి పాపులారిటీ దక్కించుకుంది.

సినిమా జయపజయాలతో సంబంధం లేకుండా అభిమానులను పెంచుకుంటున్న ఈమె తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న అగ్ర తారలను వెనక్కు నెట్టి ఇప్పుడు పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది . ఐఎండిబి ( ఇండియన్ మూవీ డేటా బేస్) విడుదల చేసిన ఈ లిస్టులో సమంత మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం. సాధారణంగా ఐఎండీబీ వాళ్లు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రతి సినిమాతో పాటు వెబ్ సిరీస్ లకు ప్రేక్షకుల స్పందనను బట్టి రేటింగ్ ఇస్తూ ఉంటారు. ఇక మన దేశంలోనూ పాపులర్ స్టార్ ఎవరనే విషయాన్ని ప్రేక్షకుల స్పందనను బట్టి ఇస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే తాజాగా జాబితాను ప్రకటించగా అందులో సమంత మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపారు ఇదే లిస్టులో పూజా హెగ్డే 17వ స్థానంలో ఉంది. ఇప్పటికే ఆర్మాక్స్ లిస్టులో సమంత వరుసగా ఏడు పర్యాయాల నుంచి టాప్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఇప్పుడు ఖుషి సినిమాతో మళ్లీ పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది మరొకవైపు సిటాడెల్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. మొత్తానికి అయితే సమంత మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news