దుర్గగుడిపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల కలకలం..!

-

ప్రస్తుతం ఏపీలో తిరుపతి లడ్డు వ్యవహారం పై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యలో విజయవాడ దుర్గగుడి పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. FSSAI ప్రమాణాలకు దూరంగా దుర్గగుడికి సరుకులు వస్తున్నట్టు గుర్తించారు అధికారులు. నిన్న, ఇవాళ రెండు రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు. స్టార్స్, అన్నదానం, ప్రసాదాలు, నైవేద్యం తయారీ సేక్షన్ అధికారుల తీరుపై విమర్శలు చేసారు.

1110 కిలోల జీడిపప్పు, 700 కిలోల కిస్ మిస్, ఒక లారీ లోడు శనగపప్పు FSSAI నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో వెనక్కి పంపారు అధికారులు. దుర్గమ్మ లడ్డు తయారీలో ఎక్కువగా జీడిపప్పు, కిస్ మిస్ వినియోగం జరుగుతుంది. లడ్డు తయారీలో వాడే ఆవు నెయ్యి, బెల్లం, శనగప్పు శాంపిల్స్ సేకరించారు. హైదరాబాద్ కు ఆ శాంపిల్స్ పంపారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. 14 రోజుల్లో రిపోర్ట్ లు వస్తాయని చెబుతున్నారు అధికారులు. దుర్గగుడి స్టోర్స్ సహా అన్నదానం, ప్రసాదం తయారీ కౌంటర్లలో విధులు నిర్వర్తిస్తున్న వారిపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news