గర్భిణీలకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్.. నగదు నేరుగా మీ అకౌంట్లోకే.. ఎలాగంటే?

-

ప్రభుత్వ పథకాలు : కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజల రక్షణ కోసం ఎన్నెన్నో పథకాలను అందిస్తూ వస్తుంది.. గర్భిణీలకు కూడా మోదీ సర్కార్ గుడ్ న్యూస్ ను చెప్పిన సంగతి తెలిసిందే.. గర్భిణీలకు అదిరిపోయే స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన(పీఎంఎంవీవై). ఈ పథకం ప్రధాన ఉద్దేశం గర్భిణుల ఆరోగ్యాన్ని కాపాడటం. ఇప్పటికే లక్షల మంది మహిళలు ఈ పథకం కింద ప్రయోజనం పొందారు.. ఈ పథకం ద్వారా ఎలా డబ్బులను పొందాలో చాలా మందికి తెలియదు.. అదేలానో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రభుత్వ పథకాలు
ప్రభుత్వ పథకాలు

కేంద్ర ప్రభుత్వం మాతృ వందన యోజన పథకం కింద మహిళలకు రూ. 5 వేలు అందిస్తుంది. ఈ రూ.5 వేలు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోనే వేస్తోంది. అయితే ఈ డబ్బులు ఒకేసారి రావు.. మూడు విడతల ప్రకారం డబ్బులను గర్భిణీల ఖాతాలో వేస్తుంది.. ఈ స్కీమ్ లో చేరడం కోసం.. ఆన్‌లైన్‌లో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదంటే మీ ఆశా వర్కర్ మిమ్మల్ని ఈ స్కీమ్‌లో చేర్పిస్తారు. https://pmmvy-cas.nic.in/public/beneficiaryuseraccount/login లింక్ ద్వారా స్కీమ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లొచ్చు. అక్కడ బెనిఫీషియరీ లాగిన్ అని ఉంటుంది. రిజిస్టర్ చేసుకొని లాగిన్ అవ్వాలి..

ఈ స్కీమ్ కు ఎవరు అర్హులు అంటే..

*. దేశ వ్యాప్తంగా ఉన్న గర్భం దాల్చిన మహిళలు అందరికీ ఈ పథకం వర్తిస్తుంది.
*. మొదటి ప్రసవానికి మాత్రమే పథకం కింద డబ్బులు వస్తాయి. రెండో ప్రసవానికి అర్హులు కారు.
*. నార్త్ టు సౌత్ అన్ని రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అమలులో ఉంటుంది.
*. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఈ పథకానికి అర్హులు కారు.
*. పథకం కింద ప్రయోజనం పొందాలని భావిస్తే.. ఎల్ఎంపీ డేట్ కచ్చితంగా కావాలి. ఎంసీపీ కార్డు కూడా కలిగి ఉండాలి. వీటిని మీరు మీ ఆశ వర్కర్ దగ్గర తీసుకోవచ్చు..
*. ఐదు నెలల లోపే ఈ పథకంలో చేరాలి. ఇది గుర్తుంచుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news