ఆర్5 జోన్ పై రైతుల పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు..సజ్జల హాట్ కామెంట్స్

-

ఏపీలో ఆర్-5 జోన్ పై జగన్‌ ప్రభుత్వానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీవో నెంబర్ 45పై మధ్యంతర ఉత్తర్వులివ్వాలంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేసింది. ఇళ్ల స్థలాల పంపిణీ కోర్టు తీర్పుకు లోబడి ఉండాలన్న ధర్మాసనం.. పిటిషన్ విచారణ సందర్భంగా సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు.రాజధాని ఏ ఒక్కరికో.. ఒక వర్గానికి పరిమితం కాదని.. రాజధాని ప్రజలందరిదన్నారు.


ఆర్5 జోన్ పై రైతుల పిటిషన్ ను హైకోర్టు..కొట్టివేయడంపై సజ్జల హాట్ కామెంట్స్ చేశారు. ఇది ఒక విజయం అని అనుకోవటం లేదు.. అడ్డంకులు సృష్టించే ప్రయత్నాన్ని కోర్టు అడ్డుకుంది.. అన్యాయమైన డిమాండ్ ను కోర్టు డిస్మిస్ చేసింది..రాజకీయ దురుద్దేశాలతో అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. రాజధాని అంటే ప్రజలు అందరూ ఉండే ప్రాంతం.. డిమొగ్రాఫిక్ ఇన్ బ్యాలెన్స్ అనే అన్యాయమైన వాదనను తీసుకుని వచ్చారని తెలిపారు సజ్జల రామ కృష్ణారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news